PUSHPA MOVIE ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMAR PUSHPA SECOND PART TITLE REVEALED TA
Pushpa - Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప’ మూవీ రెండో పార్ట్ టైటిల్ రివీల్.. భలే ఉందే..
‘పుష్ప’ మూవీ రెండో పార్ట్ టైటిల్ రివీల్ (Twitter/Photo)
Pushpa - Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప’ మూవీ ఈ రోజు విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు రెండో పార్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు.
Pushpa - Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప’ మూవీ ఈ రోజు విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ ఇరగదీసాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప సినిమా గురించే చర్చ జరుగుతంది. అల్లు అర్జున్ కెరీర్లో తొలి ప్యాన్ ఇండియా మూవీ కావడం ఈ సినిమాపై తొలి నుంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌కు హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే కదా.
మలయాళ వెర్షన్ మాత్రం రిలీజ్ కాలేదు. ఇక పుష్ప మొదటి భాగానికి ‘ది రైజ్’ అనే టైటిల్ పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో పార్ట్‌కు మాత్రం ’పుష్ప’ది రూల్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ టైటిల్‌ను మూవీలో చూపెట్టి ఈ సినిమా పై అంచనాలు పెరిగేలా చేసారు. మొత్తంగా తొలి పార్ట్‌కు వస్తోన్న రెస్పాన్స్ చూసి రెండ పార్ట్‌ను దసరా బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ టైటిల్‌ను అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
‘పుష్ప’ ది రూల్ (Twitter/Photo)
‘పుష్ప’ టీమ్ దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా టీమ్ ముంబై వెళ్లింది. అక్కడ అల్లు అర్జున్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్ సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిందీ వెర్షన్ పనులు పూర్తి కావడంతో సుకుమార్ ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. ఈ రోజు విడుదల ఉండటంతో ఈ సినిమాకు హిందుపురంలో బెనిఫిట్ షోకు ముందుగా పర్మిషన్ ఇచ్చారు. ఎంచక్కా థియేటర్స్‌లో సినిమా చూద్దామని వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమా బెనిఫిట్ షోస్ క్యాన్సిల్స్ చేయడంతో అభిమానులు థియేటర్స్ ముందు ఆందోళన చేపట్టడంతో పాటు థియేటర్ పై రాళ్లు రువ్వారు.
మరోవైపు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా రిలీజై సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అంతే కాదు ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే తెలుగులో 30 మిలియన్ పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా మంచి టాక్‌తో ఓపెన్ అయిన‘పుష్ప’ మూవీ మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.