హోమ్ /వార్తలు /సినిమా /

Pushpa : ఆ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ.. అక్కడ ఒక రోజు ఆలస్యంగా ‘పుష్ప’ రిలీజ్..

Pushpa : ఆ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ.. అక్కడ ఒక రోజు ఆలస్యంగా ‘పుష్ప’ రిలీజ్..

‘ఫుష్ప’  ప్రతీకాత్మకచిత్రం

‘ఫుష్ప’ ప్రతీకాత్మకచిత్రం

Pushpa  Allu Arjun  : ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల చేయాలని అనుకున్న అక్కడ మాత్రం ఓ రోజు ఆలస్యంగా విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Pushpa  Allu Arjun  : ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో  వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది.  ఇప్పటికే అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ  కావడం ఈ సినిమాపై తొలి నుంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌కు హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే కదా.

మరోవైపు అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంది. అక్కడ అల్లు అర్జున్ సినిమాలకు స్టార్ హీరో లెవల్లో ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఈ కోవలోనే ‘పుష్ప’ మూవీలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను ఏరికోరి మరి తీసుకున్నారు. కానీ మలయాళ వెర్షన్ ‘పుష్ప’ వెర్షన్ అక్కడ రిలీజ్ కాలేదని సమాచారం.

Pushpa - Allu Arjun : తన టీమ్ మెంబర్స్‌తో కలిసి ‘పుష్ప’ సినిమాను ఎంజాయ్ చేసిన సుకుమార్.. పిక్స్ వైరల్..


మలయాళ వెర్షన్‌ను ఓ రోజు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప’ మూవీకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.  దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పాటలు విడుదలైయ్యాయి. ఇక తాజాగా టీమ్ దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా టీమ్ ముంబై వెళ్లింది. అక్కడ అల్లు అర్జున్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్ సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిందీ వెర్షన్ పనులు పూర్తి కావడంతో సుకుమార్ ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నారు.

Nani - Shyam Singha Roy : తమిళంలో జోరుగా నాని ‘శ్యామ్ సింగరాయ్’ ప్రమోషన్స్..


మరోవైపు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా రిలీజై సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అంతే కాదు ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే తెలుగులో 30 మిలియన్ పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా మంచి టాక్‌తో ఓపెన్ అయిన‘పుష్ప’ మూవీ మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనేది చూడాలి.

First published:

Tags: Allu Arjun, Malayala Cinema, Malluwood, Mythri Movie Makers, Pushpa Movie, Pushpa Movie Review, Rashmika mandanna, Sukumar, Tollywood

ఉత్తమ కథలు