స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్( Sukumar) దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప”(Pushpa). ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. పుష్ప2(Pushpa) కూడా సుకుమార్ త్వరలో తీయనున్నాడు. పుష్ప ఎంత హిట్ అయిందో అందులో పాటలు కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలో సాంగ్స్ కూడా రికార్డులు సృష్టించాయి. ఇక సమంత(Samantha) నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా” అయిటే యూట్యూబ్‌ను షేక్ చేసింది.
అయితే ఈ ఐటమ్ సాంగ్‌ను సింగర్ మంగ్లీ(Mangli) సోదరి సింగర్ ఇంద్రావతి చౌహాన్(Indravati chauhan) పాడగా, అందుకుగాను తాజాగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్‌వుండ్(Behind woods0 వారి గోల్డ్ మెడల్‌ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్ మీడియా(Digital Media) గ్రూప్ బిహైండ్‌వుడ్ సంస్థ ఈ ఏడాది 19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్‌లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్‌కు గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేయనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్‌వుడ్ గోల్డ్ మెడల్ ప్రదానోత్సవానికి సింగర్ ఇంద్రావతిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఇంద్రావతి మే 22న ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నానని, నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని అని, ఇది నిజంగా గర్వించే విషయమని చెప్పుకొచ్చింది.
మరోవైపు పుష్ప పార్ట్ 2 పై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు సుకుమార్ కూడా పుష్ప2ను అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పార్ట్ 2 సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.
ఈ సినిమాకు ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ ద్వారా 300 కోట్ల దాకా బిజినెస్ వచ్చిందని తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ రూపం లో 200 కోట్లు, శాటిలైట్స్ మరో 100 కోట్లు ఇలా అన్ని భాషల్లో రైట్స్ చూస్తే దాదాపు 700 కోట్ల దాకా పుష్ప పార్ట్ 2 బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.పుష్ప 1 ది రైజ్ బాలీవుడ్ లో రికార్డులు సృష్టించింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.