Home /News /movies /

PUSHPA FAME ALLU ARJUN WAS NOT A FIRST CHOICE FOR GUNASEKHARS GONA GANNA REDDY CHARACTER IN RUDRAMADEVI MOVIE TA

Allu Arjun: రుద్రమదేవిలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం ముందుగా గుణశేఖర్ అనుకున్నది అల్లు అర్జున్ కాదట. .

రుద్రమదేవిలో గోనాగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ (File/Photo)

రుద్రమదేవిలో గోనాగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ (File/Photo)

Allu Arjun - Anushka - Rudramadevi | అనుష్క టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ కాదట. వివరాల్లోకి వెళితే.. 

ఇంకా చదవండి ...
    అనుష్క టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ కాదట. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్‌కు మాత్రమే సొంతం. వివరాల్లోకి వెళితే.. కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు గుణశేఖర్. ఎన్టీఆర్‌తో  ‘రామాయణం’తో పాటు అనుష్కతో ‘రుద్రమదేవి’ వంటి పౌరాణిక, చారిత్రక సినిమాలు చేసిన గుణశేఖర్ తాజాగా సమంతతో ‘శాకుంతలం’ అనే పౌరాణిక సినిమా తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు.

    ఈ సినిమాలో సమంత తొలిసారి పౌరాణిక పాత్రైన శకుంతలగా నటించారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. కథలో కీలకమైన దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు నటించారు.  సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

    Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni movies,Samantha Akkineni Shakuntalam,Samantha Akkineni Shakuntalam movie,Samantha Akkineni Shakuntalam dushyant,Samantha Akkineni Shakuntalam dev mohan dushyant,Samantha Akkineni Shakuntalam gunasekhar movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని శాకుంతలం సినిమా,శాకుంతలం సినిమా దుష్యంతుడు,దేవ్ మోహన్ దుష్యంతుడు శాకుంతలం సినిమా
    సమంత,గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా ప్రారంభం (Twitter/Photo)


    ’శాకుంతలం’ తర్వాత గుణ శేఖర్  రానాతో ‘హిరణ్యకశ్యప’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సంగతి పక్కన పెడితే..  గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోనా గన్నారెడ్డి పాత్ర హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్.. తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సినిమా సక్సెస్‌లో అల్లు అర్జున్ పాత్ర కీ రోల్ పోషించింది.

    allu arjun not a first choice for gona ganna reddy character in rudramadevi movie.,allu arjun,allu arjun gona ganna reddy rudramdevi,allu arjun jr ntr mahesh babu,allu arjun twitter,allu arjun instagram,gunasekhar jr ntr as gona ganna reddy,mahesh babu as gona ganna reddy,tollywood,telugu cinema,అనుష్క రుద్రమదేవి,రుద్రమదేవి,రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి,అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి,జూనియర్ ఎన్టీఆర్ గోన గన్నారెడ్డి,మహేష్ బాబు గోన గన్నారెడ్డి,గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్
    మహేష్ బాబు,అల్లు అర్జున్, ఎన్టీఆర్ (File/Photos)


    రుద్రమదేవి సినిమాలో ముందుగా గోనా గన్నారెడ్డి పాత్ర చేయ డానికి మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపించారట. వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలించలేక వాళ్లు ఈ క్యారెక్టర్ చేయలేకపోయారని గుణ శేఖర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ తర్వాత గోన గన్నారెడ్డి రెడ్డి పాత్ర అల్లు అర్జున్‌ను వరించినట్టు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబుతో ‘ఒక్కడు’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకున్నాను. ఎందుకో కథ సెట్ కాక ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. ఇక ‘రుద్రమదేవి’ సినిమాకు గుణ శేఖర్ హాలీవుడ్ మూవీ ‘బ్రేవ్ హార్ట్’ సినిమా స్పూర్తితో తెరకెక్కించిట్టు పలు సందర్భాల్లో వెల్లడించాడు. కాకతీయుల నేపథ్యంలో రుద్రమదేవి సినిమాను తెరకెక్కించాలని ఎందరో నిర్మాతల దగ్గరకు వెళ్లినపుడు అందరు ఈ సినిమాను హీరో ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించమని గుణశేఖర్‌కు  సలహాలు ఇచ్చారట. కానీ గుణ శేఖర్  మాత్రం కథ మార్చి తెరకెక్కించలేనని చెప్పారట. ఆ  తర్వాత గుణశేఖర్ స్వయంగా నిర్మాతగా మారి రంగంలోకి దిగి ఈ స్టోరీని తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Jr ntr, Mahesh Babu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు