PUSHPA COLLECTIONS ICON STAR ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMARS PUSHPA 3 WEEKS 21 DAYS WORLD WIDE COLLECTIONS TA
Pushpa 3 Weeks Collections : ‘పుష్ప’ 3 వారాల కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని అల్లు అర్జున్ దూకుడు..
అల్లు అర్జున్ ‘పుష్ప’ 3 వారాల కలెక్షన్స్ (Twitter/Photo)
Allu Arjun - Pushpa 3 Weeks Colections | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.ఈ సినిమా 3 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే..
Allu Arjun - Pushpa 3 Weeks Collections | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. మొత్తంగా హిందీలో 21 రోజుల్లో.. రూ. 34.15 కోట్ల షేర్ రాబట్టింది.
ఓవరాల్‌గా రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లక దగ్గరగా ఉంది. 21వ రోజు హిందీలో రూ. కోటి రూపాయలకు రూ. 10 లక్షలు తక్కువగా రూ. 90 లక్షలు రాబట్టింది. కొన్నిచోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇరగదీస్తుండంతో ఈ సినిమాను 100కు పైగా లొకేషన్స్‌లో ఓవర్సీస్లో విడుదల చేసారు. ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది.
మొత్తంగా రూ. 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. అంతేకాదు 2021 లో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి, 2.O, 'సాహో’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక హిందీ, ఓవర్సీస్, మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.04 కోట్లు వసూళ్లు సాధించింది. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 1 కోటి 15 లక్షల రూపాయలు రాబట్టింది.
ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు రూ. 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా రూ. 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా 21 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..
పుష్ప సినిమాకు రూ. 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏపీలో పలు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 3 వారాల్లో ఈ సినిమాకు రూ. 161.92 కోట్ల షేర్ వచ్చింది. మరోవైపు హిందీ తప్ప మిగతా భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఎపుడనేది త్వరలో ప్రకటించనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.