Allu Arjun - Pushpa : ‘పుష్ప’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ? అల్లు అర్జున్, సుకుమార్ ప్లాన్ ఇదేనా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ నాల్గవ పాటని నవంబర్ 19న విడుదల చేశారు.
చంద్రబోస్ రాయగా.. నకాష్ ఆజిజ్ పాడారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో నిర్వహించే ఆలోచనలో ఉన్నారట.
ఇక ‘పుష్ప’ తమిళ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక మరోవైపు ఈ చిత్రం విడుదలకు దగ్గరవ్వడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల లుక్స్‌ను విడుదల చేస్తున్నారు. దాక్షాయనిగా అనసూయను పరిచయం చేయగా.. నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా పరిచయం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా ఓ భారీ మాస్ సాంగ్‌ను చిత్రికరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం అల్లు అర్జున్ 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్లో పాల్గోంటున్నారు. సమంత ఈ పాటలో బన్నితో ఆడిపాడనుంది.
ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.
ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.