Allu Arjun - Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. హిందీ మీడియా ముందే నాన్న అల్లు అరవింద్‌ను ఆ కోరిక కోరారు. ఇది చూసి బాలీవుడ్ మీడియా కూడా అవాక్కైంది. వివరాల్లోకి వెళితే.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఈ రోజు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటనతో పాటు యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా చివరి నిమిషం వరకు షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరగడంతో ప్రమోషన్ విషయంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఒకవైపు హిందీలో నిన్నటి నిన్న ఫస్ట్ కాపీ రెడీ కావడంతో వెంటనే సెన్సార్ వాళ్లకు పంపించి సర్టిఫికేట్ తీసుకున్నారు.
లేకపోతే.. హిందీ వెర్షన్ మూవీ విడుదలకు అడ్డంకులు ఏర్పడేవి. ఇంత హడావుడిగా చేసిన అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు ఎంతో బాక్సాఫీస్ మార్కెట్ ఉన్న మలయాళంలో చివరి నిమిషంలో విడుదల కాలేకపోయింది. రేపు అక్కడ ‘పుష్ప’ సినిమా విడుదల కానుంది.
Pushpa movie review: అల్లు అర్జున్ ‘పుష్ప’ రివ్యూ.. తగ్గేదే లే అంటూనే తగ్గాడబ్బా..!
ఇక పుష్ప మొదటి భాగానికి ‘ది రైజ్’ అనే టైటిల్ పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో పార్ట్‌కు మాత్రం ’పుష్ప’ది రూల్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ టైటిల్‌ను మూవీలో చూపెట్టి ఈ సినిమా పై అంచనాలు పెరిగేలా చేసారు. మొత్తంగా తొలి పార్ట్‌కు వస్తోన్న రెస్పాన్స్ చూసి రెండ పార్ట్‌ను దసరా బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ టైటిల్‌ను అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
HBD Adivi Sesh: టాలీవుడ్‌లో డిఫరెంట్ చిత్రాలతో దూసుకెళుతున్న అడివి శేష్..
ఆ సంగతి పక్కన పెడితే.. చివరి నిమిషంలో అల్లు అర్జున్ హిందీలో ‘పుష్ఫ’ సినిమా ప్రచారం చేసారు. ఈ సందర్భంగా అక్కడ అందరి ముందే.. నాన్న అల్లు అరవింద్‌ను ఓ కోరిక కోరారు. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్.. తనతో హిందీలో డైరెక్ట్ సినిమా ఎపుడు చేస్తారా అని అడిగారు. అల్లు అరవింద్ నిర్మాతగా హిందీలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా రవిరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty) దర్శకత్వంలో ‘ప్రతిబంధ్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఇక హీరోగా చిరంజీవికి, నిర్మాతగా అల్లు అరవింద్‌కు, దర్శకుడిగా రవిరాజా పినిశెట్టికి ఇదే ఫస్ట్ హిందీ మూవీ.
Pushpa - Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప’ మూవీ రెండో పార్ట్ టైటిల్ రివీల్.. భలే ఉందే..
ఆ తర్వాత అల్లు అరవింద్ (Allu Aravind) హిందీ (hinid) లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక అల్లు అరవింద్.. ‘ఫుష్ప’ తర్వాత హిందీలో తన తనయుడు అల్లు అర్జున్‌తో డైెరెక్ట్ హిందీ సినిమా చేస్తే.. అక్కడ ఆ మూవీ సెన్సేషన్ హిట్ కావడం పక్కా అంటోంది బాలీవుడ్ మీడియా. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలకు 100 కొద్ది మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇక హిందీ బెల్ట్‌లో అల్లు అర్జున్ డబ్బింగ్ మూవీలకు మంచి ఆదరణే ఉంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్.. ఏదైనా బడా బాలీవుడ్ డైరెక్టర్‌తో హిందీ సినిమా చేస్తే సూపర్ హిట్ కావడం పక్కా అంటున్నారు. మరి ఆ దిశగా తన తనయుడుతో అల్లు అర్జున్ ..కొత్త చిత్రానికి ప్లాన్ చేస్తారా లేదా చూడాలి. ఇక ’పుష్ప’ విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సహా పలువరు మెగా హీరోలు బన్నికి బెస్ట్ విషెష్ అందజేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Allu Arjun, Bollywood news, Pushpa Movie, Pushpa Movie Review, Tollywood