PUSHPA 30 DAYS COLLECTIONS AND ALLU ARJUN SHOWING HIS POWER EVEN AFTER RELEASED IN AMAZON PRIME VIDEO PK
Pushpa 30 days collections: ఇది మరీ చిత్రం.. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చాక కూడా తగ్గని ‘పుష్ప’ దూకుడు..
Pushpa Photo : Twitter
Pushpa 30 days WW collections: పుష్ప (Pushpa 30 days WW collections) సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 170 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప.
సాధారణంగా సినిమా ఒరిజినల్ ప్రింట్ విడుదలైన తర్వాత ఫుల్ రన్ అయిపోయినట్లే. కానీ ఎందుకో మరి పుష్ప విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన తర్వాత కూడా థియేటర్స్‌లో ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో అయితే మంచి వసూళ్లు వస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మొదటి వారం తర్వాత కాస్త స్లో అయినా కూడా.. అనూహ్యంగా మూడో వారంలో పుంజుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన 30వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షలు షేర్ వచ్చింది. కానీ ఆ తర్వాత రోజు దారుణంగా పడిపోయాయి వసూళ్లు. మరోవైపు హిందీ, తమిళంలో మాత్రం జోరు తగ్గడం లేదు. నాలుగో వీకెండ్‌కు ముందే సినిమా ఓటిటిలో వచ్చేసింది. జనవరి 7న విడుదల చేసారు ఈ సినిమాను. అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే ఓటిటి ఆఫర్ రావడంతో అనుకున్న దానికంటే ముందుగానే సినిమాను ఓటిటిలో విడుదల చేసారు. అయితే హిందీ వర్షన్ కూడా ఈ మధ్యే విడుదలైంది. అయినా కూడా అక్కడ ఇంకా మంచి వసూళ్లు వస్తున్నాయి. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. ఇప్పటి వరకు పుష్ప ఎంత వసూలు చేసిందో ఓ సారి చూద్దాం..
పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 170 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప. ఇక్కడ మరో 15 కోట్లు రావాలి. నాలుగో వీకెండ్ సినిమాను ఓటిటిలో విడుదల చేయడంతో కలెక్షన్స్ ఆగిపోయాయి. అందుకే తెలుగులో మినహా అన్నిచోట్ల సినిమా సేఫ్ అయింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.