Home /News /movies /

PUSHPA 2 WEEKS 14 DAYS TOTAL WORLD WIDE COLLECTIONS ALLU ARJUN HOLDS BOX OFFICE TA

Pushpa 2 Weeks Collections : అల్లు అర్జున్ ‘పుష్ప’ 2 వీక్స్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టిందంటే..

అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ 2 వారాల కలెక్షన్స్ (Twitter/Photo)

అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ 2 వారాల కలెక్షన్స్ (Twitter/Photo)

Allu Arjun - Pushpa 2 Weeks Collections | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా 1 వీక్‌లో మొత్తంగా ఎంతగా వసూళు చేసిందంటే..

ఇంకా చదవండి ...
    Allu Arjun - Pushpa 2 Weeks Collections | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్‌ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది.  అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప.  మొత్తంగా ఫస్ట్ వీక్ హిందీలో 22. 40 షేర్.. దాదాపు రూ. 44.85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  కొన్నిచోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు.

    ఇక్కడ మరో విషయం ఏమంటే హిందీలో  ‘పుష్ప’ రూ.  2 నుంచి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. తాజాగా  దాక్కో దాక్కో మేక పాటను రిలీజ్ చేశారు. మరోవైపు ఈ సినిమాలో డిలీట్ సీన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.

    Tollywood Top Movies 2021 : అఖండ,వకీల్ సాబ్,పుష్ప సహా 2021లో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..

    పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు రూ. 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగారూ.  100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా రూ. 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా 14 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..

    నైజాం (తెలంగాణ): 38.45 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
    సీడెడ్ (రాయలసీమ): 13.37 కోట్లు / 18 కోట్లు
    ఉత్తరాంధ్ర: 7.34 కోట్లు / 12.25 కోట్లు
    ఈస్ట్: 4.50 కోట్లు / 8 కోట్లు
    వెస్ట్: 3.70 కోట్లు / 7 కోట్లు
    గుంటూరు: 4..75 కోట్లు / 9 కోట్లు
    కృష్ణా: 3.9 0కోట్లు / 7.5 కోట్లు
    నెల్లూరు: 2.89 కోట్లు / 4 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: 78.90 కోట్లు / 101.75 కోట్లు
    తమిళనాడు: 8.51 కోట్లు / 6 కోట్లు
    కర్ణాటక: 10.36 కోట్లు / 9 కోట్లు
    హిందీ: 22.40 కోట్లు / 10 కోట్లు
    ఓవర్సీస్: 12.45 కోట్లు / 13 కోట్లు
    రెస్టాఫ్ ఇండియా: 2.15 కోట్లు / 1.15 కోట్లు
    కేరళ: 4.67 కోట్లు / 4 కోట్లు
    14 రోజుల 2 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 139.70 కోట్లు (248 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

    పుష్ప సినిమాకు రూ.  145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులోరూ.  102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 14 రోజుల్లో ఈ సినిమాకు రూ.  144.90 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా రూ. 7.28 కోట్లు వస్తే హిట్ అనిపించకుంటోంది.  అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. మొత్తంగా రూ. 6.30 కోట్ల రాబడితే.. క్లీన్ హిట్‌గా నిలుస్తోంది.  ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు