Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. అయితే స్క్రిప్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా కాస్తా లేటు అయ్యిందని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా పుష్ప 2 స్క్రిప్టు విషయంలో సాయం చేస్తున్నారట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత ఎన్టీఆర్‌తో ఓ భారీ సినిమా చేయనున్నట్టుగా బుచ్చిబాబు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకాస్త సమయం ఉండడంతో బుచ్చిబాబు పుష్ప 2కు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో వర్షన్ ఏమంటే.. సుకుమారే.., ఎన్టీఆర్- బుచ్చిబాబు సినిమా కథ కోసం కొన్ని సూచనలు ఇస్తున్నారని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక పుష్ప2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఆగస్టు రెండవ వారం నుంచి షూట్‌కు వెళ్లనుందని తెలుస్తోంది. అలాగే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ చేసి సంక్రాంతి బరిలో దిగాలనీ భావిస్తున్నట్లు టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక మరో విషయం ఏమంటే.. అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఓ రేంజ్‌లో ఆఫర్స్ వస్తున్నాయట. పుష్ప 2కు సంబంధించి ఇప్పటికే ఇండియా థియేట్రికల్, ఓటీటీ హక్కులు భారీ ధర పలుకగా ఇప్పుడు ఓవర్సీస్ హక్కులపై ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం, ఈ సినిమాకి ఓవర్సీస్‌లో ఏకంగా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రేంజ్‌లో ఆఫర్స్ వస్తున్నాయట. ఈ రెండో పార్ట్‌ను సుకుమార్ దాదాపుగా 400 కోట్లతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తున్నారు.
#Buchibabu joins #PushpaTheRule Script work, most likely to hit sets on September #AlluArjun #Sukumar #Rashmika pic.twitter.com/TrzbIe50Kw
— ???????????????????????????????? ???????????????????? (@BheeshmaTalks) July 27, 2022
#sukumar at #PushpaTheRule script work.. @alluarjun @MythriOfficial @aryasukku pic.twitter.com/d9fljwzWPf
— suzen (@Suzenbabu) July 26, 2022
ఇక పుష్ప 1 (Pushpa) సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.
ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్ దక్కించుకుంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్ అదరగొట్టారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో మైమరిపించారు. పుష్పలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Director sukumar, Pushpa, Pushpa 2