స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఎంతటి సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇక బన్నీ కూడా ఊరమాస్ అవతారంలో తన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, అన్ని భాషల్లోనూ పుష్ప అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. అయితే పుష్ప 2 కూడా వస్తుందని అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ను చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. అయితే మరోసారి పుష్ప-2 సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతవరకు ఏ సినిమాలో కనిపించని విధంగా బన్నీ తన లుక్‌ను పుష్ప(Pushpa) సినిమా కోసం మార్చేసుకున్నాడు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు .. ఆయన యాస కూడా మార్చేశాడు. పుష్ప(Pushpa)లో ఊర మాస్ లుక్‌లో కనిపించినా కూడా బన్నీకి భారీ స్థాయిలో ప్రశంసలను తెచ్చిపెట్టాయి. ఇక త్వరలో సెకండ్ పార్టుగా 'పుష్ప 2' సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మొదటి పార్టులో కనిపించిన దానికి పూర్తి భిన్నంగా బన్నీ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప సంపాదన పరుడు అవుతున్న కొద్దీ ఆయన తన స్టైల్ మార్చేసుకుంటూ రావడం ఫస్టు పార్టులోనే చూపించారు. ఇప్పుడు సెకండ్ పార్టులో కూడా బన్నీ తన లుక్‌ను మరింత మేకోవర్ చేస్తాడని సమాచారం.
సెకండ్ పార్టు మధ్యకి వచ్చేసరికి పుష్ప లుక్ .. ఆయన స్టైల్ పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. ఫస్టుపార్టులో పుష్ప పాత్రను డిజైన్ చేసిన తీరు వలన ఆయనలోని డాన్సర్ కి కళ్లెం వేసినట్టు అయింది. ఈ సారి పుష్ప 2లో బన్నీ మార్కు డాన్సులు ఉంటాయని సమాచారం. పుష్పరాజ్ (Pushpa Raj) లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమాలో సమంత తన డాన్స్‌తో, అలాగే రష్మిక తన నటనతో కేక పెట్టించారు. దేవిశ్రీప్రసాద్ కూడా తన మ్యూజిక్ తో మైండ్ బ్లాంక్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.పుష్ప 2పై మరింత అంచనాలు పెంచుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.