Pushpa 17 days WW Collections: పుష్ప (Pushpa 17 days WW Collections) సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 17 రోజుల్లో ఈ సినిమాకు 155 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి వారం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కానీ వారం రోజుల తర్వాత తెలుగులో నెమ్మదిగా డౌన్ ఫాల్ మొదలైంది. అయితే అనూహ్యంగా మూడో వారంలో పుంజుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన 17వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 2.12 కోట్ల షేర్ వచ్చింది. మరోవైపు హిందీ, తమిళంలో మాత్రం జోరు తగ్గడం లేదు. మూడో వీకెండ్ అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 83.47 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 17 రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలో చూద్దాం..
పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 17 రోజుల్లో ఈ సినిమాకు 155 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప. ఇక్కడ మరో 17 కోట్లు రావాలి. మూడో వీకెండ్ ఎవరూ ఊహించని స్థాయిలో పర్ఫార్మ్ చేసింది పుష్ప. అందుకే తెలుగులో మినహా అన్నిచోట్ల సినిమా సేఫ్ అయింది. 17వ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.