Home /News /movies /

PUSHPA 16 DAYS WW COLLECTIONS ALLU ARJUN MOVIE VERY STRONG AT HINDI AND OKAY AT TOLLYWOOD BOX OFFICE PK

Pushpa 16 days WW Collections: ‘పుష్ప’ 16 డేస్ కలెక్షన్స్.. తెలుగులో జస్ట్ ఓకే.. హిందీలో మాత్రం కెవ్వు కేకే..

అల్లు అర్జున్ పుష్ప కలెక్షన్స్ (Pushpa movie collections)

అల్లు అర్జున్ పుష్ప కలెక్షన్స్ (Pushpa movie collections)

Pushpa 16 days WW Collections: అల్లు అర్జున్ (Allu Arjun Pushpa 16 days WW Collections) హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి వారం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అనూహ్యంగా మూడో వారంలో పుంజుకుంది ఈ చిత్రం.

ఇంకా చదవండి ...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి వారం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కానీ వారం రోజుల తర్వాత తెలుగులో నెమ్మదిగా డౌన్ ఫాల్ మొదలైంది. అయితే అనూహ్యంగా మూడో వారంలో పుంజుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన 16వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 2.23 కోట్ల షేర్ వచ్చింది. మరోవైపు హిందీ, తమిళంలో మాత్రం జోరు తగ్గడం లేదు. మూడో వీకెండ్ అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 81.35 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 16 రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలో చూద్దాం..

నైజాం: 39.37 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
సీడెడ్: 14.02 కోట్లు / 18 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.65 కోట్లు / 12.25 కోట్లు
ఈస్ట్: 4.64 కోట్లు / 8 కోట్లు
వెస్ట్: 3.80 కోట్లు / 7 కోట్లు
గుంటూరు: 4.88 కోట్లు / 9 కోట్లు
కృష్ణా: 4.02 కోట్లు / 7.5 కోట్లు
నెల్లూరు: 2.97 కోట్లు / 4 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 81.35 కోట్లు / 101.75 కోట్లు
తమిళనాడు: 10.20 కోట్లు / 6 కోట్లు
కర్ణాటక: 44.05 కోట్లు / 9 కోట్లు
హిందీ: 26.80 కోట్లు / 10 కోట్లు
ఓవర్సీస్: 12.85 కోట్లు / 13 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.20 కోట్లు / 1.15 కోట్లు
కేరళ: 5.10 కోట్లు / 4 కోట్లు
16 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 149.55 కోట్లు (274 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

Pushpa Collections: హిందీలో అల్లు అర్జున్ ‘పుష్ప’ సంచలనం.. విడుదలైన 16వ రోజు రికార్డు వసూళ్లు..



పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 16 రోజుల్లో ఈ సినిమాకు 149 కోట్ల షేర్ వచ్చింది. వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం 19 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి మూడో వీకెండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది పుష్ప. అందుకే తెలుగులో మినహా అన్నిచోట్ల సినిమా సేఫ్ అయింది. 16వ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu Arjun, Allu arjun pushpa movie, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు