Home /News /movies /

PUSHPA 10 DAYS WW COLLECTIONS ALLU ARJUN SUKUMAR MOVIE LONG WAY TO GO TO REACH THE CLEAN HIT STATUS PK

Pushpa 10 days WW Collections: ‘పుష్ప’ 10 డేస్ కలెక్షన్స్.. అమ్మింది ఎంత.. ఇప్పటి వరకు వచ్చింది ఎంత..?

పుష్ప కలెక్షన్స్ (Pushpa Collections)

పుష్ప కలెక్షన్స్ (Pushpa Collections)

Pushpa 10 days WW Collections: పుష్ప సినిమాకు (Pushpa 10 days WW Collections) 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ సినిమాకు 131 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది.

ఇంకా చదవండి ...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత అల్లు అర్జున్ సినిమాకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. వీక్ డేస్‌లో పుష్ప చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా పడిపోయాయి కలెక్షన్స్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో 76.46 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 10 రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలో చూద్దాం..

నైజాం: 37.31 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
సీడెడ్: 12.96 కోట్లు / 18 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.11 కోట్లు / 12.25 కోట్లు
ఈస్ట్: 4.34 కోట్లు / 8 కోట్లు
వెస్ట్: 3.58 కోట్లు / 7 కోట్లు
గుంటూరు: 4..60 కోట్లు / 9 కోట్లు
కృష్ణా: 3.77 కోట్లు / 7.5 కోట్లు
నెల్లూరు: 2.79 కోట్లు / 4 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 76.46 కోట్లు / 101.75 కోట్లు
తమిళనాడు: 8.05 కోట్లు / 6 కోట్లు
కర్ణాటక: 9.65 కోట్లు / 9 కోట్లు
హిందీ: 18.26 కోట్లు / 10 కోట్లు
ఓవర్సీస్: 12.25 కోట్లు / 13 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.12 కోట్లు / 1.15 కోట్లు
కేరళ: 4.15 కోట్లు / 4 కోట్లు
10 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 130.94 కోట్లు (229 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

Salman Khan Birthday: సల్మాన్ ఖాన్ బర్త్ డే స్పెషల్.. 7 సినిమాలతో వచ్చేస్తున్న కండల వీరుడు..


పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ సినిమాకు 131 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం 26 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu arjun pushpa movie, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు