ఇస్మార్ట్ శంకర్ నుంచి మరో ట్రైలర్.. చూస్తే దేత్తడి..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్,నభా నటేశ్ హీరో, హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ విడుదల చేసారు.

news18-telugu
Updated: July 12, 2019, 5:39 PM IST
ఇస్మార్ట్ శంకర్ నుంచి మరో ట్రైలర్.. చూస్తే దేత్తడి..
ఇస్మార్ట్ శంకర్
news18-telugu
Updated: July 12, 2019, 5:39 PM IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్,నభా నటేశ్ హీరో, హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ మొత్తం పూరీ మార్క్‌ హీరోయిజం ఉంది. ఇప్పటి వరకు పూరీ సినిమాల్లో ఉన్నట్టే రామ్‌ను హైదరాబాదీ పోరడి పాత్రలో ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ఒదిగిపోయాడు. పూర్తిగా హైద‌రాబాద్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ డైలాగులు కూడా మాస్‌ను కిక్కేంచేలా ఉన్నాయి.

Ismart Shankar movie official trailer out.. Ram, Puri Jagannadh coming up with a mass bonanza pk.. అచ్చంగా ఈ డైలాగ్ మాదిరే ట్రైల‌ర్ కూడా ఉంది. రామ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచ‌నాలున్నాయి. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు. ram pothineni,ram pothineni twitter,puri jagannadh ram pothineni,ismart shankar trailer,ismart shankar teaser,ismart shankar songs,ismart shankar,ismart shankar theatrical trailer,ismart shankar movie,ram ismart shankar,ismart shankar first look,ismart shankar movie trailer,ismart shankar full movie,ismart shankar official trailer,ismart shankar promos,ismart shankar video songs,puri jagan ismart shankar,ismart shankar movie teaser,ismart,ram ismart shankar trailer,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ రామ్,ఇస్మార్ట్ శంకర్ పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్
ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో


ఈ సినిమాలో రామ్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో కాకుండా పూర్తి డిఫరెంట్‌గా ఊర మాస్ లుక్‌తో అదరగొట్టాడు. అంతేకాదు హైదరాబాదీ తెలంగాణ యాస అక్కడక్కడ తడబడ్డ ఓవరాల్‌గా బాగుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటాష్ ఇస్మార్ట్ హైదరాబాద్ పోరీలుగా నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుందనే విషయం ట్రైల‌ర్‌తో అర్థమవుతుంది.





ఈ ట్రైలర్‌లో అరే హౌలే.. ఏం చేస్తున్నావురా అంటూ హీరోయిన్ చెబుతుంటే... హీరో బీచ్‌లో కూచొని..కింద మంట పెట్టి.. చాపకు బొక్కపెట్టి..కింద మంట పెట్టినా అనే డైలాగ్ బాగుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఇందులో కూడా పోలీస్ యాక్ష‌న్ డ్రామానే చూపించాడు పూరీ. హైద‌రాబాద్ కుర్రాడి బుర్ర‌లో చిప్ పెడ‌తారు పోలీసులు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది అస‌లు క‌థ‌. ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఏం చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈయ‌న‌తో పాటు హీరోగా రామ్‌కు ఈ సినిమా సక్సెస్ అనేది కీల‌కం. మరి ఈ సినిమాతో రామ్‌కు హిట్ అందించిన దర్శకుడిగా పూరీ జగన్నాథ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...