Home /News /movies /

PURI JAGANNATH TO PLAY A SPECIAL ROLE IN CHIRANJEEVI GOD FATHER MOVIE SB

Puri Jagnnadh: నర్సిపట్నం కుర్రాడికి చిరు సినిమాలో స్పెషల్ రోల్.. అతడు ఎవరంటే ?

చిరు సినిమాలో పూరి జగన్నాథ్

చిరు సినిమాలో పూరి జగన్నాథ్

పూరి డైరెక్షన్‌లో చిరు సినిమా ఇంతవరకు రాలేదు.కానీ.. చిరు సినిమాలో మాత్రం పూరి జగన్నాథ్‌కు ఛాన్స్ వచ్చింది. తన సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర చేయడానికి పూరికి అవకాశం కల్పించారు మెగాస్టార్.

    మెగాస్టర్ చిరంజీవి ఇవాళ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ ప్రముఖ డైరెక్టర్‌ గురించి వివరిస్తూ ఆయన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. అతనికి తన సినిమలో ఓ కీలక పాత్ర కూడా ఇస్తున్నట్లు వివరించారు. దీంతో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు చిరు చేసిన లేటెస్ట్ పోస్టుపై అనేక రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ చిరు ఎవరిపైన పోస్టు పెట్టారనే కదా మీ డౌట్ .. ఆయన ఇంకెవరో కాదు.. ? ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరికి తన సినిమాలో నటించే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు

    చిరంజీవి చేసిన ట్వీట్ చూస్తే.. ‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ఇంట్రడ్యూసింగ్ మై పూరి జగన్నాథ్ ఇన్ ఎ స్పెషల్ రోల్ ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గాడ్ ఫాదర్ అంటూ’పేర్కొన్నారు. దీంతో చిరు.. ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఏ రోల్ చేస్తున్నారు అంటూ.. ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు బాస్ పూరితో ఓ మాస్ అటిట్యూడ్ మూవీ చేయు.. లాంగ్ టైమ్ నుంచి వెయిటింగ్ ఇక్కడ అని రిప్లై ఇస్తున్నారు.

    పూరీ జగన్నాథ్.. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. డైరెక్టర్ మాత్రమే కాదు.. నిర్మాత, రచయిత కూడా. తెలుగు ప్రేక్షకులకు పూరీ సూపర్ హిట్ సినిమాలు అందించారు. ప్రముఖ హీరోలతో కలిసి ఆయన తీసిన సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి తీసిన తొలి చిత్రం బద్రి. 2000 సంవత్సరంలో బద్రి సినిమాతో ఆడియన్స్‌కు పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. బద్రి సినిమా హిట్ అవ్వడంతో పూరితో పలువురు హీరోలు సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు.

    2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన నేనింతే దానిని క్రాస్ చేసింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది అవార్డు కూడా లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి.

    పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపాడు పూరి. తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పు వంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు పూరి.

    అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ మూవీలో స్పెషల్ రోల్ చేస్తుండటంతో పూరి అభిమానులతో పాటు... అటు చిరు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూరి డైరెక్షన్‌లో చిరు సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇలా ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, God Father Movie, Puri jagannath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు