మూడో రోజుల్లో లాభాల్లోకి ‘ఇస్మార్ట్ శంకర్’ ... ఇస్మార్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

గత కొన్నెేళ్లుగా మార్కెట్‌లో మాస్ సినిమా కోసం వెయిట్  చేస్తోన్న ప్రేక్షకులకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో మంచి సినిమా దొరకడంతో కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తున్నారు.తాజాగా ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్’ ఈవెన్‌కు చేరుకుంది.

news18-telugu
Updated: July 21, 2019, 11:42 AM IST
మూడో రోజుల్లో లాభాల్లోకి ‘ఇస్మార్ట్ శంకర్’ ... ఇస్మార్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
‘ఇస్మార్ట్ శంకర్’కలెక్షన్స్
  • Share this:
గత కొన్నెేళ్లుగా మార్కెట్‌లో మాస్ సినిమా కోసం వెయిట్  చేస్తోన్న ప్రేక్షకులకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో మంచి సినిమా దొరకడంతో కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చూసి ఇప్పుడు అంతా నోరెళ్ల‌బెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్లో కూడా ఎప్పుడూ ఈ స్థాయి వ‌సూళ్లు రాలేదు. ఫ‌స్ట్ డే ఇటు తెలంగాణ‌.. అటు ఆంధ్రాలో చిన్న‌సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు ఇస్మార్ట్ శంక‌ర్. రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే రూ.7.83 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్‌తో కలుపుకొని రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. రెండో రోజు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గలేదు. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రల్లో కలిపి 4.29 కోట్ల షేర్ వసూళు చేసింది. మొత్తంగా రెండు రోజులకు గాను రూ. 11.75 కోట్ల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమా సత్తా ఏమిటో చూపించింది.

Puri Jagannadh,Ram's Ismart Shankar 3rd Day world wide collections..,ismart shankar Collections,ismart shankar Box office collections,ismart shankar second day collections,ram pothineni,ram pothineni twitter,ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar 1st day collections,ismart shankar first day collections,ismart shankar movie,ismart shankar collections,ismart shankar box office collection,ismart shankar movie first day collections,ismart shankar songs,ismart shankar movie review,ismart shankar 1st day worldwide box office collection,ismart shankar box office collections,ismart shankar review,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్ రెండు రోజుల కలెక్షన్స్,మూడో రోజు బ్రేక్ ఈవెన్,
మూడు రోజుల్లో 36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన‘ఇస్మార్ట్ శంకర్’


తాజాగా ఈ సినిమా మూడో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలుపుకొని రూ. 6.5కోట్ల షేర్ వసూళు చేసింది. మొత్తంగా ఈ సినిమాను రూ. 18 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఓవరాల్‌గా మూడు రోజుల్లో రూ.36 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న  ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చింది. పూరీ మార్క్ మాస్ డైలాగుల‌తో ఈ సినిమా నిండిపోయింది. దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, న‌భా న‌టేష్ గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. మొత్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మూడు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేసేసింది.   బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మరో సినిమా లేక‌పోవ‌డం ఇస్మార్ట్ శంక‌ర్‌కు క‌లిసొచ్చే అంశం. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర పూరీ జగన్నాథ్, రామ్‌ల దండయాత్ర ముందు ముందు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading