Puri Jagannadh - Yash: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నటించబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి శాండిల్ వుడ్ వర్గాలు. త్వరలో వీళ్లిద్దరి కలయికలో ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పూరీ జగన్నాథ్ విషయానికొస్తే.. ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్.. రామ్ పోతినేనితో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో దర్శకుడిగా తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఇపుడు అదే జోష్‌లో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్‌తో పాటు కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
విజయ్ దేవరకొండతో ‘లైగర్’ వంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత పూరీ జగన్నాథ్.. యశ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే యశ్‌కు స్టోరీ కూడా వినిపించాడట. దీనికి కేజీఎఫ్ స్టార్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు కేజీఎఫ్ 2 తర్వాత యశ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే తన నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమాను పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో పూరీ జగన్నాథ్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
దర్శకుడు పూరీ జగన్నాథ్.. యశ్‌తో తెరకెక్కిద్దామకున్న సినిమా.. గతంలో మహేష్ బాబుతో తెరకెక్కిద్దామనుకున్న ‘జనగణమన’ సినిమా అనే టాక్ వినబడుతోంది. అంతా సాఫీగా సాగితే ఈ ప్రాజెక్ట్ ఎపుడో పట్టాలెక్కేది. కానీ దర్శకుడిగా పూరీ జగన్నాథ్..వరుసగా ఫ్లాప్ సినిమాలు చేయడంతో మహేష్ బాబు పూరీతో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమాకు బ్రేకులు వేసారు. దీంతో ఈ స్టోరీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా పూరీ జగన్నాథ్.. రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావడంతో అపుడెపుడో మహేష్ బాబుతో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమా స్క్రిప్ట్‌ను మరోసారి బయటకు తీసి యశ్‌కు వినిపించి ఓకే చేయించుకున్న కథ ఇదే అనే టాక్ వినబడుతోంది.
గతంలో పూరీ జగన్నాథ్ కన్నడలో మంచి హిట్సే అందించారు. తాజాగా పూరీ జగన్నాథ్.. యశ్‌ను కలిసి ‘జనగణమన’ సినిమా స్క్రిప్ట్‌ను వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ‘కేజీఎఫ్’ పార్ట్ 2 తర్వాత పట్టాలెక్కనుంది.ఇక కేజీఎఫ్ సినిమాతో అన్ని భాసల్లో యశ్‌కు బాగా క్రేజ్ రావడంతో ఈసినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం,హిందీలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు పూరీ జగన్నాథ్. తొందర్లనే ఈ సినిమాకు సంబంధించిన అఫీపియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Puri jagannath, Sandalwood, Tollywood, Yash