ప్రధాని మోదీకి లేఖ రాసిన పూరీ జగన్నాథ్.. కొన్ని సూచనలు చేస్తూ..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై కొన్ని సూచనలను చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు.

news18-telugu
Updated: October 21, 2019, 7:57 AM IST
ప్రధాని మోదీకి లేఖ రాసిన పూరీ జగన్నాథ్.. కొన్ని సూచనలు చేస్తూ..
దర్శుకడు పూరీ, ప్రధాని మోదీ Photo: Twitter
news18-telugu
Updated: October 21, 2019, 7:57 AM IST
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై కొన్ని సూచనలను చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను పూరి తన సోషల్ మీడియా అకౌంట్ ట్వీటర్ వేదికగా షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే..   ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిత్యం వాడే కవర్లు లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై టాలీవుడ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. కొన్ని సూచనలు ఆ లేఖలో పేర్కోన్నారు.

ప్రస్తుతం వాతావరణంలో విపరీతమైన మార్పులకు కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కారణం కాదని, దీనితో పాటు అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు. కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. అయితే ఒక్క సారిగా ఈ బ్యాన్ వల్ల ప్రజలందరూ ప్లాస్టిక్‌ను వదిలి పేపర్ బ్యాగులు వాడడం చేస్తారని దీని వల్ల పేపర్‌‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో..  చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి వస్తుందన్నారు.

ఒక్క సారిగా చెట్ల నరికివేతతో పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుందని పూరి తన లేఖలో అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలంటూ చెబుతూ.., ఓ సూచన కూడా చేశారు. ప్రజలు ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ, మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి... దీనిపై వారికి అవగాహాన కలిగించాలన్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి, వాడిన ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి తిరిగి ఇస్తే.. వాటికి డబ్బులు ఇస్తామని అలా ఓ స్కీం పెట్టాలన్నారు. దీంతో ప్రజలు వాడిన ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయ్యకుండా తిరిగా జాగ్రత్తగా ఆయా కేంద్రాలకు తీసుకువచ్చి ఇస్తారని..పూరీ తన లేఖలో ప్రధానికి సూచనలు చేశారు.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...