Puri Jagannadh-Vijay Devarakonda : షూటింగ్‌కు రెడీ అవుతోన్న ఫైటర్ టీమ్.. అక్టోబర్ 10 నుండి..

Puri Jagannadh-Vijay Devarakonda : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్ తెలిసిందే.

news18-telugu
Updated: September 20, 2020, 1:15 PM IST
Puri Jagannadh-Vijay Devarakonda : షూటింగ్‌కు రెడీ అవుతోన్న ఫైటర్ టీమ్.. అక్టోబర్ 10 నుండి..
ఫైటర్ టీమ్ Photo : Twitter
  • Share this:
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్ తెలిసిందే. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుకున్న అక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశం లేదు. దీంతో ఆ ప్రణాళికను చిత్రబృందం మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని పూరి భావిస్తుందట చిత్రబృందం. అందుకే ఫైటర్ సినిమా నిర్మాతలు ఇక్కడే హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో మూవీని పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభుత్వం తాజాగా సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో ఫైటర్ చిత్రబృందం మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టనుంది. అక్టోబర్ 10వ తేదీ నుండి హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఫైటర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఎప్పటినుండో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీ అనుకుంటున్న విజయ్‌కు ఈ సినిమా మంచి అవకాశం ఉండనుంది. మరోవైపు పూరి కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను అందుకుంటుందో. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 20, 2020, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading