• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PURI JAGANNADH VIJAY DEVARAKONDA FIGHTER SHOOTS STARTS FROM OCTOBER 10 IN HYDERABAD SR

Vijay Devarakonda : బాక్సింగ్ సెట్‌లో విజయ్ దేవరకొండ.. ఏకధాటిగా షూటింగ్..

విజయ్ దేవరకొండ (vijay devarakonda)

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్ తెలిసిందే.

  • Share this:
    సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్ తెలిసిందే. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుకున్న అక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశం లేదు. దీంతో ఆ ప్రణాళికను చిత్రబృందం మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని పూరి భావిస్తుందట చిత్రబృందం. అందుకే ఫైటర్ సినిమా నిర్మాతలు ఇక్కడే హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో మూవీని పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక ప్రభుత్వం తాజాగా సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో ఫైటర్ చిత్రబృందం మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టనుంది. అక్టోబర్ 10వ తేదీ నుండి హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఫైటర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట. అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ గ్యాప్’ను పూర్తి చేయడానికి పూరి ఇక ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నాడట.

    ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఎప్పటినుండో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీ అనుకుంటున్న విజయ్‌కు ఈ సినిమా మంచి అవకాశం ఉండనుంది. మరోవైపు పూరి కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను అందుకుంటుందో. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published: