బాలీవుడ్ వెళ్తున్న పూరి.. అదిరిపోయిన కాంబినేషన్..

పూరి జగన్నాధ్ Photo : Twitter

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.

  • Share this:
    డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు సగానికిపైగా షూటింగ్ జరుపుకుంది. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఆయన తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌తో చేస్తున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పూరి జగన్నాధ్ లాక్ డౌన్ పీరియడ్ లో ఓ అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. అంతేకాదు ఈ స్క్రిప్ట్‌ను బాలీవుడ్ హీరో సల్మాన్ కోసమే రాశాడట. స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరి సల్మాన్‌కు ఫోన్ ద్వారా కథ కూడా వినిపించాడట. కథ విన్న సల్మాన్ పూరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఒకే అయ్యిందని తాజా సమాచారం. అయితే ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న రెండు చిత్రాల తర్వాత ఈ సినిమా ఉంటుందట. పూరి గతంలో అమితాబ్ బచ్చన్‌తో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ వాంటెడ్ పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేశాడు. అప్పటి వరకు వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సల్మాన్ ఖాన్ ఆ సినిమాతో మళ్లి ట్రాక్ లోకి వచ్చాడు. సల్మాన్ ప్రస్తుతం రాధే చేస్తున్నాడు. ఈ సినిమా ఈద్‌కు విడుదల కావాల్సిఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
    First published: