మహేష్ బాబు సినిమాలో కేజీఎఫ్ స్టార్ యశ్.. దర్శకుడు ఎవరంటే..

అవును మహేష్ బాబు సినిమాలో ఇపుడు యశ్ నటించబోతున్నాడు. మహేష్ బాబు సినిమాలో అంటే గతంలో మహేష్ బాబు చేద్దామనుకున్న ఒక చిత్రంలో ఇపుడు యశ్ నటించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 1, 2019, 9:08 PM IST
మహేష్ బాబు సినిమాలో కేజీఎఫ్ స్టార్ యశ్.. దర్శకుడు ఎవరంటే..
మహేష్ బాబు,యశ్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
అవును మహేష్ బాబు సినిమాలో ఇపుడు యశ్ నటించబోతున్నాడు. మహేష్ బాబు సినిమాలో అంటే గతంలో మహేష్ బాబు చేద్దామనుకున్న ఒక చిత్రంలో ఇపుడు యశ్ నటించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమాగా ‘జనగణమన’ సినిమాను తెరకెక్కిద్దామనుకున్నాడు. అంతా సాఫీగా సాగితే  ఈ ప్రాజెక్ట్ ఎపుడో పట్టాలెక్కేది. కానీ దర్శకుడిగా పూరీ జగన్నాథ్..వరుసగా ఫ్లాప్ సినిమాలు చేయడంతో మహేష్ బాబు పూరీతో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమాకు బ్రేకులు వేసాడు. దీంతో ఈ స్టోరీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా పూరీ జగన్నాథ్.. రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావడంతో అపుడెపుడో మహేష్ బాబుతో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమా స్క్రిప్ట్‌ను మరోసారి బయటకు తీసాడు.

puri jagannadh to work with kannada star hero yash.. for the mahesh babu proposed janaganamana movie,mahesh babu,puri jagannadh,yash,yash and puri jagannadh together,mahesh babu instagram,mahesh babu twitter,yash twitter,yash instagram,yash mahesh babu puri jagannadh,puri jagannadh janaganamana script with yash,kgf 2 updates,yash movie updates,mahesh babu movie updates,ismart shankar movie collections,ismart shankar success,mahesh babu new movie,mahesh babu act puri jagannadh movie,mahesh babu jana gana mana,mahesh babu gives shock to puri jagannath,mahesh babu puri jagannath movie cancelled,puri jagannadh next movie,yash puri jagannadh,puri jaganath,mahesh babu puri,puri jagannadh about mahesh babu,tollywood,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు యశ్,యశ్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ యశ్ జనగణమన మూవీ,పూరీ జగన్నాథ్ మహేష్ బాబు యశ్ జనగణమన సినిమా,మహేష్ బాబు జనగణమన స్టోరీలో యశ్,పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యశ్,
యశ్,దర్శకుడు పూరీ జగన్నాథ్ (ఫైల్ ఫోటోస్)


ఈ సారి పూరీ జగన్నాథ్ ఈ సినిమాను కన్నడ స్టార్ హీరో యశ్‌తో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. గతంలో పూరీ జగన్నాథ్ కన్నడలో మంచి హిట్సే అందించాడు. తాజాగా పూరీ జగన్నాథ్.. యశ్‌ను కలిసి ‘జనగణమన’ సినిమా స్క్రిప్ట్‌ను వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ‘కేజీఎఫ్’ పార్ట్ 2 తర్వాత పట్టాలెక్కనుంది.ఇక కేజీఎఫ్ సినిమాతో అన్ని భాసల్లో యశ్‌కు బాగా క్రేజ్ రావడంతో ఈసినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం,హిందీలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు పూరీ జగన్నాథ్. తొందర్లనే ఈ సినిమాకు సంబంధించిన అఫీపియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 1, 2019, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading