Home /News /movies /

PURI JAGANNADH TALKING ABOUT 2020 GREATNESS HERE ARE THE DETAILS TA

Puri Jagannadh: 2020 అందరిని సరదా తీర్చేసింది.. పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు..

పూరి జగన్నాధ్ Photo : Twitter

పూరి జగన్నాధ్ Photo : Twitter

Puri Jagannadh: టాలీవుడ్‌లో తనదైన డిఫరెంట్ స్టైలింగ్ సినిమాలతో ఇస్మార్ట్  దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. తాజాగా పూరీ జగన్నాథ్ 2020పై తనదైన శైలిలో కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.

  Puri Jagannadh: టాలీవుడ్‌లో తనదైన డిఫరెంట్ స్టైలింగ్ సినిమాలతో ఇస్మార్ట్  దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్.  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ డేరింగ్ దర్శకుల్లో ఈయన కూడా ఒకడు. వందల కోట్ల ఆస్తులు పోయినా మళ్లీ సంపాదించుకున్నాడు.. డ్రగ్స్ కేసు నెత్తిమీద పడినా లేచి నిలబడ్డాడు. ఏదైనా విషయం గురించి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడాలంటే కూడా పూరీని మించిన దర్శకుడు లేడు. అంతేకాదు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దులు కొట్టేలా మాట్లాడంలో తన గురువు రామ్ గోపాల్ వర్మకు అసలైన శిష్యుడు పూరీ జగన్నాథే. కరోనా సమయంలో షూటింగ్స్ గట్రా లేకపోవడంతో  తన యూ ట్యూబ్ ఛానెల్‌పై ఫోకస్ చేసాడు పూరీ.

  అంతేకాదు తన యూట్యూబ్  వేదికగా  పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే సెక్స్ , సోషల్ మీడియా ‌తో పాటు పలు అంశాలపై తన వాయిస్‌ను వినిపించాడు పూరీ జగన్నాథ్. ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కూడా. అయినా ఎక్కడా వెరవకుండా తనదైన శైలిలో  పూరీ మ్యూజింగ్స్‌లో తనదైన వీడియోలతో దూసుకుపోతున్నాడు ఈ డేరింగ్ డైరెక్టర్. తాజాగా పూరీజగన్నాథ్  2020 పై తనదైన శైలిలో పంచ్‌లు వేసాడు.

  పూరీ జగన్నాథ్ (puri jagannadh)
  పూరీ జగన్నాథ్ (puri jagannadh)


  అసలు 2020 యేడాది మావన జీవితాలను ఏ విధంగా తల కిందలు చేసిందో అందరికీ సుపరిచితమే. కోవిడ్ కారణంగా కొన్ని లక్షల మంది కన్నుమూసారు. ఇప్పటికే కరోనా కొత్త రూపాంతరం చెందింది. కరోనా కారణంగా చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. సమస్త మానవాళి ఈ దెబ్బకు చిగురుటాకుల వణికిెపోతూనే ఉంది. ఇపుడిపుడే ప్రజలు మళ్లీ సామాన్య జీవితానికి అలవాటు పడ్డారు. మరోవైపు సినిమా షూటింగ్స్‌ కూడా గతంలో మాదిరిగా కాకుండా కోవిడ్ నియమ నిబంధనలు అనుగుణంగా చేస్తున్నారు. అందుకే చాలా మందికి 2020 అన్ లక్కీ ఇయర్ అన్నారు. 2020 త్వరగా వెళ్లిపోవాలని చాలా మంది ప్రార్థించారు. 2021ను కొత్త ఆశలతో చాలా మంది స్వాగతం పలికారు. కానీ పూరీ జగన్నాథ్ మాత్రం 2020 తనతో పాటు ఎంతో మందికి మంచి చేసిన సంవత్సరం అంటున్నారు.

  Puri jagannadh news, Puri jagannadh to work with salman khan, Puri jagannadh web series, Vijay devarakonda to enter in digital, Vijay Devarakonda news, Karan Johar movies,vijay devarakonda,viya devarakonda new house,vijay devarakonda twitter,vijay devarakonda instagram,vijay devarakonda facebook,vijay devarakonda marraige,vijay devarakonda, vijay deverakonda, vijay devarakonda family photos, vijay devarakonda movies, vijay devarakonda house, vijay devarakonda new house cost, vijay devarakonda speech, hero vijay devarakonda new house details, tollywood, vijay devarakonda house warming ceremony, vijay deverakonda rare pics, vijay deverakonda hosue rare pics, news mantra, marriage, songs, telugu movie scene, latest movies, parents brother, girlfriend, tamil, malayalam, telugu films, biography, family, trailer, house, cars, salary, net worth, vijay deverakonda luxury life, vijay deverakonda latest images, vijay deverakonda latest pics, vijay deverakonda unseen images, vijay deverakonda unseen pictures, vijay deverakonda house rare im
  పూరి జగన్నాథ్ Photo : Twitter


  చాలా మంది 2020 యేడాదిని తిట్టారు. కానీ మనకు 2020 ఎంతో నేర్పించింది. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని నేర్పించింది. మంచి ఆహారం తినాలనే విషయాన్ని నేర్పించింది. అందరు శుభ్రత నేర్చుకున్నారు. ఇక పుట్టిన తర్వాత మనం ఇన్ని సార్లు ఎపుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోలేదు. అంతేకాదు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా కరోనా కారణంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. వైరస్, న్యూట్రేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాండీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ వంటి ఎన్నో పదాలను తెలుసుకున్నారు. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి అంటే మెంటల్ కండిషన్ కూడా అవసరమని తెలిసింది.

  పూరీ జగన్నాథ్ (puri jagannadh)
  పూరీ జగన్నాథ్ (puri jagannadh)


  అంతేకాదు కరోనా మనకు ఎంతో ఓర్పును నేర్పును నేర్పించింది. డబ్బు విలువ కరోనా నేర్పించింది. ఈ కష్టకాలంలో చాలా మందికి నిజమైన స్నేహితులు ఎవరో తెలిసొచ్చేలా చేసింది. ప్రకృతి ఎంతో బలీయమైనది. ప్రకృతి ప్రకోపిస్తో.. ఎంతటి మనుషులైన ఆ దేవుడు కూడా కాపాడలేడన్న విషయం తెలిసొచ్చింది. గతం మనది కాదు. భవిష్యత్తు కూడా మనది కాదు. ఈ రోజు హాయిగా గడిపేలా చేసింది కరోనా. ప్రతి రోజు ఏదో ఒక పని చేద్దాం. రోజు తగినంత వ్యాయామం చేద్దాం. మనకు ఎంతో అమూల్యమైన కరెంట్, నీరు, ఆహారాన్ని వేస్ట్ చేయద్దనే విషయం తెలిసొచ్చింది. ప్రకృతిని పలకరిద్దాం. బ్రతికినన్ని రోజులు పండగలా ఎంజాయ్ చేద్దాం అంటూ 2021లో అందరు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలని చెప్పకనే పెద్ద చురకే అంటించాడు పూరీ జగన్నాథ్.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: New Year 2021, Puri Jagannadh, Tollywood

  తదుపరి వార్తలు