విజయ్‌కి పూరి సపోర్ట్ : ఈ యుద్ధంలో గెలవాలంటే ఫైట్ చేయాల్సిందే..

కొన్ని వెబ్ సైట్స్ తప్పుడు వార్తలు రాస్తున్నాయని తనను టార్గెట్ చేసుకుని తన ఇమేజ్‌ను దెబ్బతీయాలని కొందరూ చూస్తున్నారని విజయ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 5, 2020, 2:10 PM IST
విజయ్‌కి పూరి సపోర్ట్ : ఈ యుద్ధంలో గెలవాలంటే ఫైట్ చేయాల్సిందే..
ఛార్మి కౌర్ (Instagram/ Charmme Kaur)
  • Share this:
కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అండగా విజయ్ దేవరకొండ ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అవసరమున్న ఫ్యామిలీలకు నిత్యావసరాలను అందజేస్తున్నాడు. ఇందుకోసం ఓ 25 లక్షల రూపాయల్నీ విరాళంగా అందజేశాడు. అంతేకాకుండా ఆర్థికంగా ఓ స్థితిలో ఉన్నవారు ఈ కార్యమానికి డొనేషన్ ఇవ్వోచ్చని పేర్కోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై కొన్ని వెబ్ సైట్స్ తప్పుడు వార్తలు రాస్తున్నాయని తనను టార్గెట్ చేసుకుని తన ఇమేజ్‌ను దెబ్బతీయాలని కొందరూ చూస్తున్నారని ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా కిల్ ఫేక్ న్యూస్ అనే ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వదిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ విజయ్‌కు అండగా నిలుస్తోంది. హీరో మహేష్‌తో పాటు రానా, దర్శకుడు కొరటాల శివ, క్రిష్, అల్లరి నరేష్, అనిల్ రావిపూడి, నాగబాబు, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా.. చిరంజీవి ఇలా చాలా మంది నీకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా విజయ్‌కు మద్దతుగా పూరి జగన్నాద్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆయన తన ట్వీట్‌లో విజయ్‌ను ఉద్దేశిస్తూ.. ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు అంటూ రాసుకొచ్చాడు. ఆయన ఇంకా తన ట్వీట్‌లో నీ సొంత డబ్బును పెట్టావు, అంతేకాకుండా ఎంతో ఎఫర్ట్ పెట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టావ్.. అయితే మనం యుద్ధ వాతావరణంలో ఉన్నాము.. ఈ యుద్ధంలో గెలవాలంటే ఫైట్ చేయాల్సిందే.. అంటూ ట్వీట్ చేశాడు. విజయ్ హీరోగా పూరి దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

Published by: Suresh Rachamalla
First published: May 5, 2020, 2:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading