విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పిన పూరి జగన్నాథ్
షూటింగ్లో భాగంగానే అర్థరాత్రి విజయ్ దేవరకొండ బర్త్ డేనిసెలబ్రేట్ చేశారు. విజయ్ చేత కట్ చేయించారు. సమంత సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేట్ చేశారు.
టాలీవుడ్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఈ స్టార్ హీరోకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలబ్రిటీలు, అభిమానులు దేవరకొండకు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు (Viajy Devarakonda Birthday Celebrations) ఈ సారి సమంత (Samantha) సమక్షంలో జరగడం విశేషం. సమంతతో కలిసి ఆయన `వీడీ11` వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.
శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతుంది. షూటింగ్లో భాగంగానే అర్థరాత్రి విజయ్ దేవరకొండ బర్త్ డేనిసెలబ్రేట్ చేశారు. విజయ్ చేత కట్ చేయించారు. ఆయనకు గుర్తిండిపోయేలా బర్త్ డే విషెస్ తెలిపారు. ఇదిలా ఉంటే అంతకు ముందే, ఆదివారం సాయంత్రం విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని సమంత విడుదల చేయడం విశేషం.
అందులో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) చెప్పిన విషెస్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. `నేను నీ హార్ట్ లోని ఫైర్ చూశా. నీ లోపల ఉన్న ఫైన్ యాక్టర్‌ని చూశా. నీ మైండ్‌లో ఏం ఏముందో నాకు తెలుసు. నీ ఆకలి, నీ మ్యాడ్నెస్, నీ కమిట్మెంట్, నీ హంబుల్‌నెస్ అన్ని నిన్ను ఓ స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. ఒకరోజు నువ్వు దేశం గర్వించే వ్యక్తిగా నిలుస్తావు. అప్పుడు నేను నిన్ను పిలుస్తాను ది విజయ్ దేవరకొండ. హ్యాపీ బర్త్ డే` అని అంటూ పవర్ఫుల్ నోట్‌ని పంచుకున్నారు పూరీ జగన్నాథ్. ఇది వైరల్ అవుతుంది.
ఇక పూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లైగర్ విడుదల కాకముందే విజయ్, పూరి కలిసి 'జన గణ మన' ప్రాజెక్టును లైన్లో పెట్టారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి లవ్ అండ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.