Puri Jagannadh: పెళ్లి చేసుకుంటే ఏం పీకలేవ్.. బుద్దున్నోడెవడూ తాళి కట్టడు..

పూరీ జగన్నాథ్ (puri jagannadh)

Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ఈ మధ్య సినిమాల కంటే కూడా యూ ట్యూబ్‌పై పడ్డాడు. ఎలాగూ ఇప్పుడు సినిమాలు లేకపోవడం.. షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో జీవిత సత్యాలు..

  • Share this:
పూరీ జగన్నాథ్ ఈ మధ్య సినిమాల కంటే కూడా యూ ట్యూబ్‌పై పడ్డాడు. ఎలాగూ ఇప్పుడు సినిమాలు లేకపోవడం.. షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో జీవిత సత్యాలు చెప్పే కార్యక్రమం మొదలు పెట్టాడు ఈ దర్శకుడు. మొన్నామధ్య సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉన్నదున్నట్లు చెప్పిన ఈయన.. ఇప్పుడు పెళ్లిపై పడ్డాడు. బుద్దున్నోడు ఎవడూ పెళ్లి చేసుకోడంటూ ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో పూరీ జగన్నాథ్ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్నాడు.
పూరీ జగన్నాథ్ (puri jagannadh)
పూరీ జగన్నాథ్ (puri jagannadh)

అందులో ఇప్పటికే కొన్ని విడుదలయ్యాయి. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడాడు. పెళికి పోయేకాలం దగ్గరికి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒకవేళ పెళ్లి నిజంగా అంత మంచిదే అయితే ఏసు క్రీస్తు పది పెళ్లిళ్లు చేసుకునేవాడు.. ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలో మీరేమైనా సాధించాలంటే దయచేసి పెళ్లి చేసుకోవద్దు.. చేసుకుంటే ఏం పీకలేరు అంటూ ఓపెన్ కామెంట్స్ చేసాడు ఈయన.
పూరీ జగన్నాథ్ (puri jagannadh)
పూరీ జగన్నాథ్ (puri jagannadh)

అలా కాదు నాకు జీవితంలో ఏం చేయాలని లేదు.. నేను అందర్లాంటి ఎదవనే.. పెళ్లి చేసుకుని పెళ్లాం చేసిపెట్టే పకోడి తింటా.. పిల్లలతో ఆడుకుంటా అనుకుంటే చేసుకోండి.. అలా కాదు ప్రపంచమంతా తిరగాలి.. నాకు ఓ లక్ష్యం ఉంది.. జీవితంలో ఇది సాధించాలనుకుంటే మాత్రం ఎవరికీ తాళి కట్టొద్దంటూ చెప్పుకొచ్చాడు పూరీ. ఆ పట్టుదల మీకుంటే కాళ్లకి పారాణి మాత్రం రాయొద్దు.. ఎవర్నీ జీవితంలోకి రానీయొద్దు.. సోలోగా బతికేయ్ అంటూ చెప్పాడు ఈ దర్శకుడు.

అలా కాదు నాకు పెళ్లి లేకపోతే ఉండలేను అనుకుంటే మాత్రం అర్జంటుగా మీ వెడ్డింగ్ కార్డ్ నాకు పంపించండి.. వచ్చి బ్లెస్ చేస్తానంటూ చెప్పాడు. ఒక్కటి మాత్రం నిజం మనలాంటి యావరేజ్ పర్సన్స్ మాత్రమే పెళ్లి చేసుకుంటారు.. తెలివైనోడు మాత్రం పెళ్లి చేసుకోడంటూ చెప్పాడు ఈయన. పెళ్లి అనేది అబద్ధం అంటున్నాడు పూరీ. అది మంచిది కాదని చెప్తే పూజలు ఉండవు.. చర్చికి వెళ్లరు.. అలా దేవుడితో కనెక్షన్ కట్ అయిపోద్ది కాబట్టి ఎవరూ చెప్పడు.
పూరీ జగన్నాథ్ (puri jagannadh)
పూరీ జగన్నాథ్ (puri jagannadh)

ఒక్కటి మాత్రం నిజం.. పెళ్లైన వాళ్లంతా పెళ్లి కాని బాబాల కళ్ళ మీదే పడతారు అంటున్నాడు పూరీ జగన్నాథ్. పెళ్లైన హీరోయిన్ కంటే కూడా పెళ్లి కాని హీరోయిన్‌కు క్రేజ్ ఎక్కువ ఉంటుంది. పెళ్లైతే లిస్టులోంచి తీసి పక్కన పడేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దయచేసి పెళ్లి చేసుకోవద్దు.. చేసుకుంటే మళ్లీ చెప్తున్నా ఏం పీకలేవు.. పెళ్ళాం వేసే పకోడిలు తినడం తప్ప అంటూ కామెంట్ చేసాడు ఈయన. పెళ్లి వ్యవస్థపై పూరీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: