మ‌హేష్‌పై పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు.. హిట్స్ ఉంటేనే మేం గుర్తుంటాం..

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేష‌న్లో రెండు హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఈ రోజు మహేష్ బాబు స్టార్ డ‌మ్‌కు పూరీ కూడా ప్రధాన కారణమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 19, 2019, 5:16 PM IST
మ‌హేష్‌పై పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు.. హిట్స్ ఉంటేనే మేం గుర్తుంటాం..
మహేష్ బాబు పూరీ జగన్నాథ్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేష‌న్లో రెండు హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మ‌హేష్ ఈ రోజు ఇంత స్టార్ డ‌మ్ అనుభవిస్తున్నాడంటే దానికి బీజం వేసింది పూరీ జ‌గ‌న్నాథ్ కూడా. పోకిరి త‌ర్వాతే మ‌హేష్ సూప‌ర్ స్టార్ అయ్యాడు. అలాంటి పూరీని ఆ మ‌ధ్య తెలియ‌కుండానే అవ‌మానించాడు మ‌హేష్. మహర్షి ప్రీ రిలీజ్ వేడుక‌లో అంద‌రి పేర్లు చెప్పి సుకుమార్, పూరీ పేర్లు మ‌రిచిపోయాడు. ఈ విష‌యంలో త‌ర్వాత మ‌ళ్లీ గుర్తు చేసుకుని చెప్పినా కూడా స్టేజీపై చెప్ప‌నందుకు మాత్రం బాగానే హ‌ర్ట్ అయిన‌ట్లున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
Puri Jagannadh sensational comments on Mahesh Babu and says he loves Mahesh fans than him pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేష‌న్లో రెండు హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఈ రోజు మహేష్ బాబు స్టార్ డ‌మ్‌కు పూరీ కూడా ప్రధాన కారణమే. mahesh babu,puri jagannadh,puri jagannadh about mahesh babu,puri jagannadh movies,mahesh babu movies,mahesh babu puri jagannadh movies,mahesh babu puri jagannadh,mahesh babu news,mahesh babu maharshi,mahesh babu new movie,mahesh babu jana gana mana,puri jagannadh on mahesh babu,puri jagannadh mahesh babu movie,puri jagannadh interview mahesh babu,puri jagannadh mahesh babu time waste,telugu cinema,మహేష్ బాబు,పూరీ జగన్నాథ్,మహేష్ పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
పూరీ మహేష్ బాబు

ఇప్పుడు ఈయ‌న మాట‌ల్లో ఇది క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావ‌డంతో ఆ జోరులో ఉన్నాడు పూరీ. ఇదే ఊపులో బాల‌య్య కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ బాబు సినిమా గురించి అడిగారు మీడియా మిత్రులు. దీనికి పూరీ కూడా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పాడు. మ‌హేష్ బాబు కంటే ఆయ‌న ఫ్యాన్స్ చాలా ఇష్టం.. మీరు సినిమా ఎప్పుడు చేస్తున్నార‌ని ప్ర‌తీసారి అడుగుతూనే ఉంటాడు.. మీకు కూడా తెలుసు మ‌హేష్ కోసం జ‌న‌గ‌ణ‌మ‌న స్క్రిప్ట్ సిద్ధం చేసాన‌ని అని చెప్పాడు పూరీ జ‌గ‌న్నాథ్. కానీ మ‌హేష్ బాబుకు తాను హిట్ల‌లో ఉన్న‌పుడు మాత్ర‌మే గుర్తుంటాన‌ని చెప్పాడు.

Puri Jagannadh sensational comments on Mahesh Babu and says he loves Mahesh fans than him pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేష‌న్లో రెండు హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఈ రోజు మహేష్ బాబు స్టార్ డ‌మ్‌కు పూరీ కూడా ప్రధాన కారణమే. mahesh babu,puri jagannadh,puri jagannadh about mahesh babu,puri jagannadh movies,mahesh babu movies,mahesh babu puri jagannadh movies,mahesh babu puri jagannadh,mahesh babu news,mahesh babu maharshi,mahesh babu new movie,mahesh babu jana gana mana,puri jagannadh on mahesh babu,puri jagannadh mahesh babu movie,puri jagannadh interview mahesh babu,puri jagannadh mahesh babu time waste,telugu cinema,మహేష్ బాబు,పూరీ జగన్నాథ్,మహేష్ పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
పూరీ మహేష్ బాబు

గ‌తంలో ఆయ‌న‌కు రెండు మంచి సినిమాలు ఇచ్చాన‌ని.. అదెప్పుడూ ఉంట‌ద‌ని చెప్పాడు పూరీ. కానీ మ‌హేష్ మాత్రం తాను హిట్ కొట్టిన‌పుడే ఛాన్స్ ఇస్తాడు.. అందుకే ఆయ‌న కంటే ఫ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్ట‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. మ‌రి ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ హిట్టైంది క‌దా మ‌హేష్ సినిమా చేస్తారా అంటూ అప్పుడు ఒకే అనడానికి నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా అని మ‌రో ఘాటు రిప్లై ఇచ్చాడు ఈయ‌న‌. మొత్తానికి పూరీ స‌మాధానం చెప్పిన తీరు చూస్తుంటే మ‌హేష్ బాబు తీరు బాగానే హ‌ర్ట్ చేసిన‌ట్లుంది. అందుకే ఈయ‌న ఇలా సెటైర్లు వేసాడంటున్నారు అభిమానులు. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుందో రాదో..?

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>