పూరీ జగన్నాథ్ తనయుడు బాగా రొమాంటిక్ అబ్బా.. బ్యాక్ లెస్ పోజ్..

ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2019, 12:28 PM IST
పూరీ జగన్నాథ్ తనయుడు బాగా రొమాంటిక్ అబ్బా.. బ్యాక్ లెస్ పోజ్..
రొమాంటిక్ పోస్టర్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2019, 12:28 PM IST
ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే తానే కథ, స్క్రీన్ ప్లే రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి ఆ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాకు రొమాంటిక్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఆకాశ్‌కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ నటిస్తుంది.

ఈ భామ కూడా పూర్తిగా అందాల ఆరబోతకు రెడీ అంటుంది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఏకంగా బ్యాక్ లెస్ పోజ్ ఇచ్చి పిచ్చెక్కించింది ఈ భామ. ఈ ఫస్ట్ లుక్ ఇప్పుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్ కాదు.. హాట్‌గా ఉంది. యూత్ టార్గెట్‌గా ఈ చిత్రం విడుదలవుతుంది. రొమాన్స్ ఎప్పటికీ చాలా ఘాటుగా ఉంటుందంటూ పూరీ ట్వీట్ చేసాడు. ఈ సినిమాను ఛార్మితో కలిసి పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్నాడు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...