కొడుకుతో దగ్గరుండి ముద్దు పెట్టించిన పూరీ జగన్నాథ్..

Romantic Movie: ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ జగన్నాథ్. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా డిజాస్టర్ కావడంతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 10, 2020, 3:02 PM IST
కొడుకుతో దగ్గరుండి ముద్దు పెట్టించిన పూరీ జగన్నాథ్..
ఆకాశ్ పూరీ, కేతిక శర్మ రొమాంటిక్ మూవీ పోస్టర్ (romantic movie akash puri)
  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. నిజంగానే దగ్గరుండి తనయుడితో ముద్దులు పెట్టిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇదంతా సినిమా కోసమేలెండి.. నిజంగా మాత్రం కాదు. ఆకాశ్ పూరీ నటిస్తున్న రొమాంటిక్ సినిమా గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ జగన్నాథ్. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్.

ఆకాశ్ పూరీ, కేతిక శర్మ రొమాంటిక్ మూవీ పోస్టర్ (romantic movie akash puri)
ఆకాశ్ పూరీ, కేతిక శర్మ రొమాంటిక్ మూవీ పోస్టర్ (romantic movie akash puri)


అందుకే తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి ఆ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాకు రొమాంటిక్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇప్పటికే విడుదలైన బీచ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన పాటకు కూడా మంచి స్పందనే వచ్చింది. మొన్నటికి మొన్న నా వల్ల కాదే అంటూ ఫుల్ బాటిల్ ఎత్తేసాడు ఆకాశ్. ఇందులో ఆకాశ్‌కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ నటిస్తుంది. ఈ భామ కూడా పూర్తిగా అందాల ఆరబోతకు రెడీ అంటుంది.


ఆ మధ్య విడుదలైన వీడియోలో అసలు ఏం చూస్తున్నామో కూడా అర్థం కానంతగా రెచ్చిపోయింది కేతిక. పూర్తిగా బీచ్‌ అందాల మధ్య అన్నీ ఆరబోసింది ఈ ముంబై బ్యూటీ. ఏకంగా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది ఈ భామ. ఇప్పుడు పబ్లిక్ ప్లేసులో రన్నింగ్ బస్సులో ముద్దు పెట్టేసాడు ఆకాశ్. తాజాగా విడుదలైన ఆకాశ్, కేతిక లిప్ లాప్ పోస్టర్ సంచలనం రేపుతుంది. మే 29న రొమాంటిక్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఎంత హాట్‌గా ఉండబోతుందో ఇప్పటికే విడుదలైన వీడియోలు.. ఇప్పుడు విడుదలైన పోస్టర్ చూస్తుంటే అర్థమైపోతుంది. మొత్తానికి తనయుడిని దగ్గరుండి మరీ రొమాంటిక్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్.
Published by: Praveen Kumar Vadla
First published: February 10, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading