news18-telugu
Updated: July 19, 2020, 8:08 AM IST
పూరి జగన్నాధ్ Photo : Twitter
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇంట్లో ఖాలీగా ఉంటున్న పూరి ఈ లాక్ డౌన్ సమయంలో ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. పూరి రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ లాక్ డౌన్ వ్యవధిలో పూరి వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడట. దీంతో అన్ని కుదిరితే.. ఈ కరోనా విజృంభణ తగ్గిన వెంటనే షూటింగ్ వెళ్లనుందట టీమ్.

ఇస్మార్ట్ శంకర్ సినిమా పోస్టర్ Photo: Twitter.com/purijagan
ఇక ఆ వెబ్ సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌తో పాటు పూరి మరో సినిమా స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేశాడట. ఆ సినిమాను హిందీ హీరో సల్మాన్ ఖాన్‌తో చేయాలనీ పూరి ప్లాన్.. అందులో భాగంగా ఆయనకు ఫోన్లో కథ వినిపించడం.. ఆయన ఓకే అనడం కూడా జరిగాయని తెలుస్తోంది.

ఫైటర్ మూవీ సెట్లో పూరీ,విజయ్,అనన్యాలతో ఛార్మి Photo : Twitter
ఇక ఈ సినిమాతో పాటు పూరి బాలయ్య కోసం కూడా కథ రాశాడట. ఇప్పటికే పూరి, బాలయ్యతో ఓకే కూడా అనిపించుకున్నాడట. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్‌కు వెళ్లనుందని సమాచారం. ఇక ప్రస్తుతం పూరి, విజయ్‌తో చేస్తున్న ఫైటర్ ఇటు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.
Published by:
Suresh Rachamalla
First published:
July 19, 2020, 8:08 AM IST