హోమ్ /వార్తలు /సినిమా /

Puri Jagannadh : ‘లైగర్’ తర్వాత పూరీ జగన్నాథ్ ప్యాన్ వరల్డ్ మూవీ.. హీరో ఎవరంటే..

Puri Jagannadh : ‘లైగర్’ తర్వాత పూరీ జగన్నాథ్ ప్యాన్ వరల్డ్ మూవీ.. హీరో ఎవరంటే..

Puri Jagannadh : ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత మరోసారి ప్యాన్ వరల్డ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇంకా చదవండి ...

  Puri Jagannadh :  ఎన్టీఆర్‌తో చేసిన ’టెంపర్’  సినిమా తర్వాత సరైన  సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు  రామ్‌ పోలినేనితో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. పోస్ట్ ప్రొడక్షన్స్..పనులు మిగిలున్నాయి. ఈ సినిమాను ఆగష్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు రూ.  65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.

  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు భారత్‌లోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది.ఈ సినిమా తర్వాత న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించడమే అని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోవడమే తన డ్రీమ్ అంటున్నాడు.తాజాగా ఈ చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నట్టు పూరీ జగన్నాథ్ చెప్పారు.

  Bheemla Nayak Trailer Talk : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే..

  అప్పట్లో మహేష్ బాబుతో ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. అప్పట్లో పూరీ జగన్నాథ్.. కూడా ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసాడు. కానీ మహేష్ బాబుకు మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో పూరీ జగన్నాథ్.. మహేష్ బాబుతో ‘జనగణమన’  పాడించలేకపోయాడు.

  పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)
  పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)

  గతేడాది లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ  సినిమాకు కొన్ని మెరుగులు దిద్దాడట. ఈసారి పూర్తి స్క్రిప్ట్‌తో మహేష్ బాబును మెప్పించాలని చూసారు.కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇపుడు ఈ  చిత్రాన్ని విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఆ మధ్య కన్నడ హీరో, కేజియఫ్ స్టార్ యశ్‌ను కూడా కలిసి కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్ లాంటి హిందీ హీరోలను కూడా ట్రై చేసాడు పూరీ జగన్నాథ్. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు హీరో దగ్గరే ఈ కథ ఆగిపోయినట్లు తెలుస్తుంది. లైగర్ హీరో విజయ్ దేవరకొండతోనే జన గణ మన పాడించాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda

  ఉత్తమ కథలు