పూరీ జగన్నాథ్ పెళ్లికి తాళి బొట్టు కొనిచ్చిన టాప్ యాంకర్..

Puri Jagannadh: బద్రి సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి కావడం.. అలాగే తన కెరీర్ కూడా 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో జోష్ మీద కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 22, 2020, 2:13 PM IST
పూరీ జగన్నాథ్ పెళ్లికి తాళి బొట్టు కొనిచ్చిన టాప్ యాంకర్..
భార్య లావణ్యతో పూరీ జగన్నాథ్ (puri jagannadh lavanya)
  • Share this:
బద్రి సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి కావడం.. అలాగే తన కెరీర్ కూడా 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో జోష్ మీద కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. గతేడాది ఈయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ కూడా మంచి విజయం సాధించడంతో ఈయనలో తెలియని జోరు వచ్చేసింది. తన కెరీర్ 20 ఏళ్ల సందర్భంగా చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడుతున్నాడు పూరీ. ముఖ్యంగా ఈయన జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన గురించి చెప్పుకున్నాడు పూరీ. తన పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. తను ప్రేమించిన అమ్మాయిని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు ఈ దర్శకుడు.

Sensational Director Puri Jagannadh opens up about his marriage and told about his friend who helped for wedding pk ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా విజయంతో మనోడిలో మళ్లీ జోష్ వచ్చింది. హిట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు ఈ దర్శకుడు. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh marriage news,puri jagannadh anchor Jhansi,puri jagannadh actress hema,puri jagannadh friends,puri jagannadh smoking,puri jagannadh ismart shankar,ismart shankar collections,ismart shankar movie collections,director puri jagannadh,puri jagannadh movies,puri jagannadh daughter,puri jagannath,puri jagannadh interview,puri jagannath movies,puri jagannadh marriage,puri jagannadh dialogues,puri jagannadh house,puri jagannadh speech,puri jagannadh family unseen images,puri jagannadh face to face,puri jagannadh family rare and unseen images,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ పెళ్లి,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్ (Source: Twitter)


పూరీ పెళ్లి సినిమా ట్విస్టుల కంటే ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా తన పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరిగిందని గుర్తు చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు పూరీ. అప్పటికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని.. కానీ స్నేహితులు మాత్రం అప్పుడు తనకు అండగా నిలిచారని చెప్పాడు పూరీ.

భార్య లావణ్యతో పూరీ జగన్నాథ్ (puri jagannadh lavanya)
భార్య లావణ్యతో పూరీ జగన్నాథ్ (puri jagannadh lavanya)


తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు ఈయన. అప్పటి టాలీవుడ్ టాప్ యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని చెప్పాడు ఈ సంచలన దర్శకుడు. పెళ్లి బట్టలు కట్టుకుని తాళి బొట్టు కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి ఎంచక్కా సాయంత్రం మళ్లీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరీ.
Published by: Praveen Kumar Vadla
First published: April 22, 2020, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading