#JanataCurfew : ఇలా చేశారంటే ఇల్లు వదిలి బయటకు వెళ్లరు : పూరి..

కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: March 22, 2020, 1:41 PM IST
#JanataCurfew : ఇలా చేశారంటే ఇల్లు వదిలి బయటకు వెళ్లరు :  పూరి..
పూరి జగన్నాధ్ Twitter
  • Share this:
కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియా వేదికగా అన్నేసి గంటలు ఇంట్లో ఉండడం తమ వల్ల కాదని మాట్లాడుతున్న వారికి పూరి జగన్నాధ్ ఓ అదిరిపోయే సలహా ఇచ్చాడు. దీనికి సంబందించి ఆయన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఏవరైతే చాలా సేపు తమ ఇంట్లో ఉండలేక పోతున్నారో వాళ్లు ఆముదం తాగాలని పూరి జగన్నాథ్ సలహా ఇచ్చాడు. ఇంట్లో ఉండలేమంటూ ప్రస్టేషన్‌కు గురయ్యే వారికి తన నుండి ఇదో సలహా అని, అలాంటి వారు ఉదయం నాలుగు స్పూన్ల ఆముదం తాగాలని సూచించాడు. అలా చేస్తే విరేచనాలు పట్టుకుని బయటకు రాలేరని వివరించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అందరం ప్రధాని మాట విందామని ఆ వీడియోలో పేర్కొన్న పూరి.. అలా చేస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందన్నాడు. పెద్దల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందామన్నాడు. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

First published: March 22, 2020, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading