పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ అయినా.. ప్లాప్ అయినా ఆయన స్టైల్ మాత్రం మారదు. అదే స్టైల్లో వరస సినిమాలు చేస్తూనే ఉంటాడు. రెండేళ్ల కింద కొడుకుతో మెహబూబా అంటూ చాలా రోజుల తర్వాత ప్రేమకథ చేసినా కూడా అది వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు పూర్తిగా మాస్ అవతారంలోకి మారిపోయి ఇస్మార్ట్ శంకర్ అంటున్నాడు. మరోసారి తన స్టైల్లోనే అదే గన్స్, మాఫియా.. పోలీసుల చుట్టూనే తిరుగుతున్నాడు పూరీ.

ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో
ఇప్పటికే విడుదలైన ప్రోమోస్, పాటలు, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. దీనికి A సర్టిఫికేట్ ఇచ్చారు. సాధారణంగా తన సినిమాకు A సర్టిఫికేట్ వస్తే దర్శక నిర్మాతలు కంగారు పడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో అని టెన్షన్ పడతారు. కానీ పూరీ మాత్రం ఖుషీ అవుతున్నాడు. ఎందుకంటే ఈయన పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను A సర్టిఫికేట్ ప్రేక్షకుల కోసమే తీసాడు. ఈ విషయ ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. పాటల్లో అమ్మాయిల అందాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఈ చిత్రంతో పూరీ కచ్చితంగా హిట్ కొడతాడని నమ్ముతున్నారు అభిమానులు. దీనికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పోకిరి.. అల్లు అర్జున్ దేశముదురు.. మహేష్ బాబు బిజినెస్మేన్ కూడా అప్పట్లో A సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి. ఈ మూడు మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా A వచ్చింది. దాంతో ఇప్పుడు కూడా హిట్ కొడతానని పూర్తి నమ్మకంతో కనిపిస్తున్నారు అభిమానులు. మరి వాళ్ల నమ్మకాన్ని ఇస్మార్ట్ శంకర్ ఎంతవరకు నిలబెడతాడో..?
Published by:Praveen Kumar Vadla
First published:July 15, 2019, 19:26 IST