నేను చేసిన మంచి పనులు ఆ రెండే... పూరీ జగన్నాథ్

Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌‌కు గత కొన్నేళ్లుగా తీసిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో సతమతమవుతున్న సమయంతో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీశారు. ఈ సినిమా.. పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే రెండింతలు తీసుకొచ్చింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పూరీ జగన్నాథ్ మాట్లాడారు.

news18-telugu
Updated: August 5, 2019, 8:47 AM IST
నేను చేసిన మంచి పనులు ఆ రెండే... పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ (Source: Twitter)
  • Share this:
Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌‌కు గత కొన్నేళ్లుగా తీసిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో సతమతమవుతున్న సమయంతో రామ్‌తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే రెండింతలు తీసుకొచ్చింది. దాదాపు అన్ని మార్కెట్స్‌లో ఇటూ ఓవర్సీస్ మార్కెట్, ఇటూ డొమెస్టిక్ మార్కెట్స్‌లలలో కలెక్షన్స్‌తో ఊపేస్తోంది. ఇప్పటికీ విడుదైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 75 కోట్ల మైలురాయి కూడా అందుకుంది ఈ ‘ఇస్మార్ట్ శంకర్’. దీంతో ప్రెస్ మీట్ పెట్టింది చిత్ర బృందం.. ఈ సందర్బంగా దర్శకుడు హీరో రామ్ మాట్లాడుతూ.. నా గత చిత్రాలకన్నా డిఫరెంట్‌ పాత్రలో నటించాను. పూరి గారు చాలా కొత్తగా చూపించారు. ఆయన టేకింగ్‌, మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ... ఈ మధ్యకాలంలో నేను చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి హీరో రామ్‌ని కలవడం, రెండోది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా తీయడం అన్నారు. రామ్‌ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టిందన్నారు.


మొత్తానికి పూరీ చాలా రోజుల తర్వాత పూరీ.. కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చేసారు. కొన్నిచోట్ల అయితే రెండింతలు లాభాలు తీసుకొచ్చింది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’.  దీంతో త్వరలోనే ఈ సినిమాకు భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.
First published: August 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...