గుండెలపై పూరీ జగన్నాథ్ పచ్చబొట్టు.. ట్వీట్ చేసిన ఛార్మి కౌర్..

సాధారణంగా పచ్చబొట్టు వేసుకునేంత అభిమానం కేవలం హీరోలపై మాత్రమే ఉంటుంది. ఎంత ప్రేమ ఉన్నా కూడా గుండెలపై పచ్చబొట్టు వేసుకోవడం మాత్రం అరుదు. ఇక హీరోలకు కాకుండా అంత అదృష్టం మరెవరికి ఉండదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 3:44 PM IST
గుండెలపై పూరీ జగన్నాథ్ పచ్చబొట్టు.. ట్వీట్ చేసిన ఛార్మి కౌర్..
పూరీ జగన్నాథ్ టాటూ (Source: Twitter)
  • Share this:
సాధారణంగా పచ్చబొట్టు వేసుకునేంత అభిమానం కేవలం హీరోలపై మాత్రమే ఉంటుంది. ఎంత ప్రేమ ఉన్నా కూడా గుండెలపై పచ్చబొట్టు వేసుకోవడం మాత్రం అరుదు. ఇక హీరోలకు కాకుండా అంత అదృష్టం మరెవరికి ఉండదు. కానీ ఇక్కడో అభిమాని మాత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ బొమ్మను తన గుండెలపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే పూరీ అంటే తనకు ప్రాణం అంటున్నాడు ఆ ఫ్యాన్. అతడి పేరు ప్రభాకర్.. ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూరీని కలిసాడు ఈ ఫ్యాన్. తన గుండెలపై ఉన్న ఈయన బొమ్మను పూరీకి చూపించాడు.


అది చూసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు పూరీ జగన్నాథ్. ఇక ఈ మొత్తం వీడియోను తీసి అభిమానులకు షేర్ చేసింది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఈమె కూడా ఓ నిర్మాత. పూరీతో నాలుగేళ్ళ ప్రయాణంలో ఆమె అందుకున్న తొలి బ్లాక్ బస్టర్ ఇది. అందుకే ఎక్కడా తగ్గట్లేదు ఛార్మి. ఇప్పట్నుంచి పూరీ మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు రాసి పెట్టుకోండి అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ ఇది అంటూ పచ్చబొట్టును కూడా హైలైట్ చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు