Puri Jagannadh : వైట్ కార్డ్ ఉన్నవారికి ఓటు హక్కు తీసేయాలి : పూరి జగన్నాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు

పూరి జగన్నాధ్ Photo : Twitter

Puri Jagannadh : టాలీవుడ్ డాషిండ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ పేదవారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

  • Share this:
    టాలీవుడ్ డాషిండ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ రిజర్వేషన్స్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ లేక ఖాళీగా ఉంటున్న పూరి... తన ఇంట్లో ఉంటూ పోడ్‌కాస్ట్ రూపంలో అనేక విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తాజాగా దేశంలో ఉన్న పేదల గురించి మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశాడు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదంటూ చెబుతూ.. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదన్నాడు. అంతేకాదు అసలు పేదవారికి, నిరక్షరాస్యులకు తమ నాయకుడిని ఎన్నుకునే ఓటు హక్కు తీసేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇంకా తన పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు, పథకాలను అనుభవిస్తూ.. చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయిందని అవగాహాన లేని మాటలు మాట్లాడాడు. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలని పేర్కోన్నాడు.

    ఇక రిజర్వేషన్లు గురించి మాట్లాడుతూ.. రిజర్వేషన్స్ కులాన్ని బట్టి కాకుండా.. పేదోడు ఏ కులంలో ఉన్నా.. వాళ్లకు సపోర్ట్ చేయాలని.. వాళ్ల పిల్లలు చదువుకునేలా చూడాలన్నాడు. ప్రభుత్వాలను, నాయకులను అడుక్కోవడం మానేయ్యాలంటూ.. ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం తను పడే కష్ట పడుతుంది లేదంటే చనిపోతుంది. కాళ్లు చేతులు బాగున్నప్పుడు మన చేతులు చాచొద్దు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే పూరి చేసిన కామెంట్స్‌పై దళిత, బహుజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజం పట్ల అవగాహాన లేకుండా మాట్లాడుతున్నాడంటూ మండిపడుతున్నారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉండాల్సిన ఓ దర్శకుడు ఇలాంటి అవగాహాన రహిత మాటలు మాట్లాడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూరి జగన్నాధ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
    Published by:Suresh Rachamalla
    First published: