ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 20 ఇయర్స్ ఇండస్ట్రీ..

డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీ జర్నీ ఈ సోమవారంతో 20 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన ఆయన దర్శకత్వంలో  తొలి చిత్రంగా తెరకెక్కించిన బద్రి సినిమాని రిలీజ్ అయింది.

news18-telugu
Updated: April 19, 2020, 7:34 PM IST
ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 20 ఇయర్స్ ఇండస్ట్రీ..
పూరీ జగన్నాథ్@20 ఇయర్స్ ఇండస్ట్రీ (Twitter/Photo)
  • Share this:
డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీ జర్నీ ఈ సోమవారంతో 20 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన ఆయన దర్శకత్వంలో  తొలి చిత్రంగా తెరకెక్కించిన బద్రి సినిమాని రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ చిత్రంతోనే  హీరోయిన్స్‌గా రేణు దేశాయ్, అమీషా పటేల్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.  విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.  తొలి చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పూరీ అదే ఉత్సాహంతో జగపతిబాబుతో ‘బాచి’ సినిమా తీసి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.

దర్శకుడిగా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ (Twitter/Photo)


ఆ తర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి వంటి వరుస సూపర్ హిట్‌లతో తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంటూ వెళ్లిన పూరీ 2006లో తెరకెక్కించిన ‘పోకిరి’ సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఈ సినిమా పాత రికార్డులని చెరిపేసి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఆపై అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ‘దేశముదురు’ కూడా సూపర్ హిట్ అయింది. ఇక రామ్ చరణ్ తొలి సినిమా అయిన ‘చిరుత’కు దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్..  ఆ సినిమాతో మెగా హీరోకు మంచి హిట్ అందించాడు.

చిరుతలో రామ్ చరణ్ (Twitter/Photo)


ఆ తర్వాత బుజ్జిగాడు, బిజినెస్ మ్యాన్‌, టెంపర్ వరకు పూరీ ప్రభంజనం కొనసాగగా ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక గత ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కించారు. సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆయనకు దర్శకుడిగా మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టింది. అంతేకాదు తన వారసుడిగా కొడుకు ఆకాష్ పూరీని హీరో చేసాడు. ఇతను హీరోగా ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు.  ఇక ప్రస్తుతం టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది.

Vijay Deverakonda action scenes,Vijay Deverakonda to romance with Ananya panday,Purijagannadh Fighter,vijay devarakonda,vijay devarakonda fighter movie,vijay devarakonda new movie,vijay devarakonda fighter,vijay devarakonda movies,vijay deverakonda,vijay devarakonda fighter movie updates,vijay devarakonda fighter teaser,vijay devarakonda songs,vijay deverakonda movies,vijay devarakonda jhanvi kapoor,vijay devarakonda movies in hindi dubbed,vijay devarakonda fighter movie trailer,పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే,ఛార్మి,కరణ్ జోహార్
విజయ్, అనన్య, పూరీ, ఛార్మి Photo : Twitter


కానీ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఎప్పుడనేది చూడాలి.  ఒకవైపు దర్శకుడిగానే కాకుండా ముందు వైష్టో అకాడమీ, ఆ తర్వాత పూరీ కనెక్ట్స్ బేనర్‌ని స్థాపించి మంచి సినిమాలు నిర్మిస్తున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. సోమవారంతో ఇండస్ట్రీకి వచ్చి పూరీ జగన్నాథ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ పూరీ జగన్నాథ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. కరణ్‌.. ఫైటర్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
First published: April 19, 2020, 7:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading