‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్‌తో దూకుడు పెంచాడు హీరో రామ్. కొత్త సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. దీపావళి సందర్భంగా రామ్ హీరోగా నటిస్తున్న ‘రెడ్’ మూవీ ఫస్ట్ లుక్‌ను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో రామ్ కొత్త లుక్ అదిరిందన్నారు ఫ్యాన్స్. దీపావళి మంచి గిఫ్ట్ ఇచ్చాడంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా .. రామ్ న్యూ లుక్‌పై కామెంట్స్ చేశాడు. ‘ఒక రేంజ్లో ఉంది... క్లాసీ మసాలా పోస్టర్’ అంటూ పొగడ్తలు కురిపించాడు పూరీ.
రామ్ తన నెక్ట్స్ మూవీ కిశోర్ తిరుమల డైరెక్షన్లో తీస్తున్నారు. గతంలో వీరద్దరి కాంబినేషన్లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ప్రేమకథా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి లవ్ స్టోరీ కాకుండా క్రైమ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హిట్ ‘తడమ్’కి తెలుగు రీమేక్‌గా ‘రెడ్’ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. దీంతో దీపావళికి తన లుక్‌తో ‘రెడ్’ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు రామ్.
Ok range lo undi 😀💪🏽💪🏽💪🏽💪🏽 classy masala poster 👌🏾 https://t.co/5xfKhqZ0j9
— PURIJAGAN (@purijagan) October 28, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni, Tollywood, Tollywood Movie News, Tollywood news