Puri Jagannadh : డబ్బు లేకపోతే దేవున్ని కూడా గౌరవించరు : పూరి జగన్నాధ్..

పూరి జగన్నాధ్ Photo : Youtube

Puri Jagannadh : టాలీవుడ్ డాషిండ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ లేక ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు.

  • Share this:
    టాలీవుడ్ డాషిండ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ లేక ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు. అందులో భాగంగా పూరి... తన ఇంట్లో ఉంటూ పోడ్‌కాస్ట్ రూపంలో అనేక విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నాడు. తాజాగా ఆయన డబ్బు గురించి మాట్లాడుతూ.. జీవితంలో డబ్బు చాలా అవసరం అని పేర్కోన్నాడు. డబ్బు లేకపోతే ఎవడు గుర్తించడని.. డబ్బులేని దేవుడ్నీ కూడా మనషులు గౌరవించని తెలిపాడు. అడవిలో బతికేటోడికి డబ్బు అవసరం ఉండదు కానీ.. సమాజంలో బతకాలంటే చాలా అవసరం అని.. మాట్లాడాడు. జీవితానికి సరిపడ డబ్బు సంపాదించుకోవాలనీ తన పాడ్ కాస్ట్‌లో చెప్పాడు పూరి. ఇక ఆయన గతంలో రిజర్వేషన్స్ గురించి, దేశంలో పేదల గురించి మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశాడు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదంటూ చెబుతూ.. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదన్నాడు. అంతేకాదు అసలు పేదవారికి, నిరక్షరాస్యులకు తమ నాయకుడిని ఎన్నుకునే ఓటు హక్కు తీసేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు, పథకాలను అనుభవిస్తూ.. చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయిందని అవగాహాన లేని మాటలు మాట్లాడాడు. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలని పేర్కోన్నాడు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

    ఇక పూరి జగన్నాధ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో త్వరలోనే షూటింగ్ పున: ప్రారంభం కానుంది. ఈ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. అనన్య పాండే హీరోయిన్’గా చేస్తోంది. కరణ్ జోహార్, ఛార్మీలు కలసి నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: