ఛార్మి పూరిలకు కరోనా దెబ్బ.. అంతా క్లోజ్ అంటూ ప్రకటన..

కరోనా.. ఈ మాట చాలు వణికిపోవడానికి.. ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోన్న ఈ వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలౌతున్నాయి.

news18-telugu
Updated: March 17, 2020, 3:55 PM IST
ఛార్మి పూరిలకు కరోనా దెబ్బ..  అంతా క్లోజ్ అంటూ ప్రకటన..
పూరి, ఛార్మి Photo : Twitter
  • Share this:
కరోనా.. ఈ మాట చాలు వణికిపోవడానికి.. ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోన్న ఈ వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలౌతున్నాయి. ఈ వైరస్‌కు కులం, మతం, రంగు బేధం లేదు అందర్నీ ఓకే రీతిగా చూస్తూ ఆటాడుకుంటోంది. సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ, క్రీడ.. ఇలా అన్ని రంగాలను భయపెడుతోంది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో సినీ రంగం చాలా నష్టపోతోంది. షూటింగ్స్ రద్దవడంతో పాటు సినిమాల విడుదల తేదీలు మారడం ఇలా అనుకున్న సమయానికి సినిమా విడుదలకాకపోతే ఎంతో నష్టపోతాడు నిర్మాత. ఈ కరోనా దెబ్బకు తెలుగులో కూడా చాలా సినిమాలు షూటింగ్‌లను రద్దు చేసుకున్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే కరోనా ధాటికి తన ఆఫీస్‌నే క్లోజ్ చేశాడు. కరోనా మహమ్మారి నుండి తన ఆఫీస్ స్టాఫ్‌ను కాపాడుకునేందుకు ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నామన్నాడు. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించి జాగ్రత్తగా ఉండాలనీ.. ఈ కరోనా చేస్తోన్న దాడిని అందరం కలసికట్టుగా పోరాడి ఓడించాలనీ కోరాడు. దీనికి సంబందించి ఓ ప్రకటనను నిర్మాత ఛార్మి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.


కాగా పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమా ముంబయిలో షూటింగ్ జరుపుకుంది. కరణ్ జోహార్, ఛార్మీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 40 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేసిన టీమ్ తాజాగా ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. అయితే హైదరాబాద్ లో త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడా షెడ్యూల్ డైలమాలో పడింది.
Published by: Suresh Rachamalla
First published: March 17, 2020, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading