Home /News /movies /

PURI JAGANNADH BROTHER SAI RAM SHANKAR NEW MOVIE TITLED AS OKA PATHAKAM PRAKAARAM AND 1ST LOOK RELEASED BY RGV PK

Sai Ram Shankar: సాయి రామ్ శంకర్ గుర్తున్నాడా.. ‘ఒక పథకం ప్రకారం’ వస్తున్న పూరీ తమ్ముడు..

ఒక పథకం ప్రకారం పోస్టర్ (sai ram shankar)

ఒక పథకం ప్రకారం పోస్టర్ (sai ram shankar)

Sai Ram Shankar: ‘143’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సాయి రామ్ శంకర్ (Sai Ram Shankar). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తమ్ముడిగా వచ్చిన ఈయన.. చాలా రోజుల తర్వాత ఒక పథకం ప్రకారం కొత్త సినిమా చేస్తున్నాడు.

‘143’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సాయి రామ్ శంకర్. పూరీ జగన్నాథ్ తమ్ముడిగా వచ్చిన ఈయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. మధ్యలో బంపర్ ఆఫర్ సినిమా ఒక్కటే ఈయనకు విజయాన్ని అందించింది. ఆ తర్వాత, ముందు ఒక్క హిట్ కూడా లేదు. వరస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ కోరుకున్న విజయం మాత్రం రావడం లేదు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఈయన ఓ సినిమా చేస్తున్నాడు. ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ టీమ్‌తో సాయి రామ్ శంకర్ సినిమా చేస్తున్నాడు. అశీమా నర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ఒక పథకం ప్రకారం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్.


పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో కచ్చితంగా తనకు విజయం వస్తుందని నమ్మకంగా చెప్తున్నాడు సాయిరామ్ శంకర్. చాలా రోజుల తర్వాత ఒక పథకం ప్రకారం అంటూ వస్తున్న పూరీ తమ్ముడికి కోరుకున్న విజయం వస్తుందో రాదో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు