డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న డాషింగ్ డైరెక్టర్, క్రేజీ స్టార్..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.

news18-telugu
Updated: May 26, 2020, 6:42 AM IST
డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న డాషింగ్ డైరెక్టర్, క్రేజీ స్టార్..
మొత్తానికి ఇలాంటి విషయాలను చూసిచూడనట్లు వదిలేయకుండా వెంటనే స్పందించి విజయ్ దేవరకొండ టీం కూడా మంచి పని చేసిందంటూ అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణతో ఓ సినిమాకు కమిట్‌మెంట్ ఇచ్చాడు.
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ ఖాలీగా ఉండకుండా ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసినట్లు తెలుస్తోంది. పూరి రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగా ఈ లాక్ డౌన్ కాలంలో పూరి వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రజల ముందుకురానుంది. విజయ్ దేవరకొండ కూడా డిజిటల్‌లోకి ప్రవేశిస్తున్నాడని తాజా సమాచారం. అల్లు అరవింద్ పార్ట్‌నర్‌గా ఉన్న 'ఆహా' అనే ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విజయ్ ఆహాకి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్‌లలో పాలుపంచుకోబోతున్నాడు. విజయ్ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ తరపున ఓ రెండు వెబ్ సిరీస్‌లు రానున్నాయట. అందులో భాగంగా ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మహేంద్రకి అప్పజెప్పేశాడట. మహేంద్ర గతంలో విజయ్ తమ్ముడు ఆనంద్ ప్రధాన పాత్రలో దొరసాని అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌కి సంబంధించిన స్టార్స్ డిజిటల్ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సమంత అమెజాన్ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో నటింస్తోండగా, ఆమె బాటలో కాజల్, తమన్నా, షాలినీ పాండే ఇలా పలువురు స్టార్స్ పయనిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే బాటలో రామ్ చరణ్, సుకుమార్ కూడా వెళ్తునట్లు సమాచారం. ఈ కాంబోలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ వస్తున్నట్లు వినికిడి.
Published by: Suresh Rachamalla
First published: May 26, 2020, 6:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading