పూరి జగన్నాథ్, రామ్‌ల బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్.. ఇప్పుడు హిందీలోకి

పూరి జగన్నాథ్, రామ్‌ల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'.. త్వరలో హిందీ ప్రేక్షకుల్నీ అలరించనుంది. అక్కడ ఈ సినిమాను రీమేక్ చేయడానికి రంగం సిద్దమైంది.

news18-telugu
Updated: October 4, 2019, 8:25 AM IST
పూరి జగన్నాథ్, రామ్‌ల బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్.. ఇప్పుడు హిందీలోకి
Instagram/ram_pothineni
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. కొన్నాళ్లుగా సరైన విజయం లేక సతమతం అవుతున్న సమయంలో.. మరో వైపు రామ్ కూడా కెరీర్ పరంగా తన స్టామీనాకు తగ్గ హిట్‌ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేయడం.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.  సినిమాలో పూరి టేకింగ్‌కి.. రామ్ ఎనర్జీ తోడవడం పాటు పూరి రాసిన డైలాగ్స్ ‌తో  తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం అదిరిపోయాయి. వీటితో పాటు నిధి అగర్వాల్, నభా నటేష్‌లు తమ అందచందాలతో సినిమాకు మరింత ఆకర్షణను తెచ్చారు. ఈ సినిమా మాస్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను ఇతర భాషాల్లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు హిందీ, తమిళ్ ఇండస్ట్రీల నుండి రీమేక్స్ రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వచ్చాయట. తమిళ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థకు అమ్మేయడం జరిగిందని, అంతేకాదు  ఈ తమిళ 'ఇస్మార్ట్ శంకర్‌'లో ధనుష్ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ వర్గాల టాక్. 

View this post on Instagram
 

‪isssssshhhtttaaarrtttt camera! From today! #iSmartShankar ‬


A post shared by RAm POthineni (@ram_pothineni) on

అది అలా ఉంటే తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారని... ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా సొంతం చేసుకున్న ఆ సంస్థ త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>