మహేష్ బాబుతోనే ‘జనగణమన’.. అలా ఫిక్సైన పూరీ జగన్నాథ్..?

పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)

Mahesh Babu Jana Gana Mana: 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగడం లేదు.

  • Share this:
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. ఈ టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి అదే శంకర్‌కు కలిసొచ్చింది. ఇప్పుడు ఈ హిట్‌తో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చినా కూడా పూరీకి ఒరిగింది మాత్రం లేదు.

పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)
పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)


ఈయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది కానీ లేదంటే ఈ పాటికే పూర్తైపోయుండేది. జూన్‌లోనే విడుదలకు కూడా ప్లాన్ చేసాడు ఈయన. లాక్‌డౌన్ పుణ్యమా అని చాలా సమయం దొరకడంతో వరసగా స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాడు పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే మహేష్ బాబు కోసం కూడా కథ సిద్ధం చేసినట్లు చెప్పాడు ఈయన. ఇప్పటికే రెండుసార్లు ఆయనకు కథ చెప్పాలని చూసి ఫెయిల్ అయ్యాడు పూరీ. దాంతో ఫ్లాపుల్లో ఉంటే మహేష్ పట్టించుకోడని కామెంట్స్ కూడా చేసాడు పూరీ జగన్నాథ్. ఇప్పటికే పోకిరి, బిజినెస్‌మేన్ ఈ కాంబో‌లో వచ్చాయి.

పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)
పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)


ఇప్పుడు హ్యాట్రిక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు పూరీ జగన్నాధ్. చాలా రోజులుగా ‘జనగణమన’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేసాడు పూరీ. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. మహేష్ బాబుకు స్క్రిప్ట్ వినిపించేందుకు ఎదురు చూస్తున్నట్లుగా దర్శకుడు పూరీ చెప్పాడు. అంతేకాదు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు ఈ డేరింగ్ డైరెక్టర్. ఫైటర్ హిట్ అయితే మహేష్ బాబుతో ‘జనగణమన’ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.. లేదంటే మాత్రం అది అలాగే ఉండిపోతుందేమో..?
First published: