రక్షించాలని మొక్కితే.. ఆ దేవుడు కూడా పంపేది పోలీసోడినే.. పూరీ జగన్

దిశా హత్య కేసులో నిందితులను పోలీసులు ఈరోజు ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనపై పూరీ జగన్ స్పందించారు.

news18-telugu
Updated: December 6, 2019, 11:17 AM IST
రక్షించాలని మొక్కితే.. ఆ దేవుడు కూడా పంపేది పోలీసోడినే.. పూరీ జగన్
Twitter
  • Share this:
దిశా హత్య కేసులో నిందితులను పోలీసులు ఈరోజు ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసారు. వివరాల్లోకి వెళితే.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేయడంతో.. నిందితులపై లీసులు కాల్పులు జరిపారని సమాచారం. ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు సైతం గాయపడినట్లు సమాచారం. నవంబరు 28న రాత్రి శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో లారీలపై పని చేసే నలుగురు వ్యక్తులు దిశాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని అందరూ డిమాండ్ చేస్తున్న సమయంలోనే.. తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్ స్పందించారు. తెలంగాణ పోలీసులకు సల్యూట్ చేస్తున్నానని, అంతేకాదు చేతులెత్తి మొక్కుతున్నానంటూ మీరే నిజమైన హీరోలని ప్రశంసించారు. మనకి కష్టమొచ్చిన కన్నీళ్లోచ్చినా పోలీసోడే వస్తాడని.. అంతేందుకు నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ పూరీ జగన్ కొంత ఎమోషనల్ అవుతూ స్పందించారు.First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>