PUNJABI SINGER SARDOOL SIKINDER PASSES AWAY AT 60 DUE TO COVID 19 PK
Sardool Sikander: కరోనాతో కన్నుమూసిన ప్రముఖ గాయకుడు.. ముఖ్యమంత్రి సంతాపం..
శార్దూల్ సికిందర్ కన్నుమూత (Sardool Sikinder)
Sardool Sikander: కరోనా వైరస్ ఇప్పటికే తీరని షోకాన్ని మిగిల్చింది. ఎంతోమంది ప్రముఖులను మనకు దూరం చేసింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి లెజెండరీ సింగర్‌ను కూడా శాశ్వతంగా దూరం చేసింది కరోనా వైరస్. ఇప్పుడు మరో సింగర్ కూడా ఈ వైరస్..
కరోనా వైరస్ ఇప్పటికే తీరని షోకాన్ని మిగిల్చింది. ఎంతోమంది ప్రముఖులను మనకు దూరం చేసింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి లెజెండరీ సింగర్‌ను కూడా శాశ్వతంగా దూరం చేసింది కరోనా వైరస్. ఇప్పుడు మరో సింగర్ కూడా ఈ వైరస్ బారిన పడి మరణించాడు. కోవిడ్ తగ్గిపోతుందని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్నా కూడా పంజా మాత్రం విసురుతూనే ఉంది. తాజాగా కరోనా బారిన పడి ప్రముఖ పంజాబీ గాయకుడు శార్ధూల్ సికిందర్ కన్నుమూసాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా మొదలు కావడంతో ఇంకా ఎన్ని దుర్వార్తలు వినాల్సి వస్తుందో అని అంతా కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రముఖ సింగర్ శార్దూల్ సికిందర్ కరోనాతో పోరాడుతూ మరణించాడు. కొన్ని రోజులుగా ఈయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు శార్దూల్. ఈ నేపథ్యంలోనే ఈయన్ని మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. కిడ్నీ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈయనకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24 ఉదయం తుదిశ్వాస విడిచాడు శార్దూల్ సికిందర్. పంజాబ్‌లో ఈయనకు మంచి పేరుంది. శార్దూల్ సికిందర్ మృతిపట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సంతాపం తెలిపారు. శార్ధూల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అంటూ కొనియాడారు సంగీత ప్రియులు.