Punarnavi: ఆడియన్స్ సెంటిమెంట్‌ను దెబ్బ కొట్టిన పునర్నవి.. మండిపడుతున్న నెటిజన్స్..

పునర్నవి భూపాలం (Instagram/Photo)

Punarnavi Bigg Bos sFame : పునర్నవి భూపాలం .. బిగ్‌బాస్ మూడో సీజన్‌ కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ఓ ఇంటావిడా కాబోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఓ ఫోటోను పోస్ట్ చేసి అందరి అటెన్షన్ తనపై ఉండేలా చూసుకుంది. తాజాగా పునర్నవి ఇదంత చేసింది దేవి కోసమంటే..

  • Share this:
    Punarnavi Bigg Bos sFame : పునర్నవి భూపాలం .. బిగ్‌బాస్ మూడో సీజన్‌ కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ఓ ఇంటావిడా కాబోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఓ ఫోటోను పోస్ట్ చేసి అందరి అటెన్షన్ తనపై ఉండేలా చూసుకుంది. ఆమె అమెరికాలో సాప్ట్ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఉద్భవ్ రఘునందన్ అనే హైదరాబాదీని పెళ్లి చేసుకోబోతున్నట్లు చూచయగా చెప్పేసింది. ఉద్భవ్ కూడా సోషల్ మీడియాలో చాలా మందికి పరిచయమే. అతను చికాగో సుబ్బారావు అనే యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నాడు. ఆ ఛానల్‌లో అతడు అమెరికాలో తెలుగువారు పడుతున్న కష్టాల్నీ ఫన్నీగా చూపిస్తుంటాడు. ఇక  పునర్నవి భూపాలం విషయానికొస్తే..  అప్పటి వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హౌజ్‌లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, పునర్నవిలు సన్నిహితంగా మెదులుతూ ఆడియన్స్‌లో ఈ షోపై  ఆసక్తిని పెంచారు. చెప్పాలంటే వారి మధ్య చిన్నపాటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా‌ నడిచింది. బయటకు వచ్చాక కూడా వీరిద్దరూ పలు టీవీ కార్యక్రమంలో జంటగా హాజరై ప్రేక్షకులను అలరించారు.  ఐతే.. ఇప్పటి వరకు పునర్నవి పోస్టులు చూసి అందరు ఆమె నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నట్టు అందరు అనుకున్నారు.



    కానీ ఈమె అల్లు అరవింద్‌కు సంబంధించిన ఆహా  ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం ‘Commit Mental’ కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా పునర్నవి ఇదంత చేసింది. ఎక్కడ కూడా తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా చెప్పలేదు. కానీ ఆడియన్స్ ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించడంతో అంతా ఆమె నిశ్చితార్ధం జరిగినట్టు అనుకున్నారు. ఇందులో పునర్నవిని తప్పుపట్టాల్సిన పనిలేదంటున్నారు. ఆమె స్వయంగా ఎక్కడా పెళ్లి ప్రస్తావన తేలేదు. మీడియాతో కొంత మంది అత్యుత్సాహంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు ఏదేదో రాసేసారు. మొత్తానికి తాను యాక్ట్ చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్‌ ప్రమోషన్ కోసం పునర్నవి చేసిన ఈ ట్రిక్స్ బాగానే వర్కౌట్ అయిందనే చెప్పాలి. కొంత మంది మాత్రం పునర్నవి ఆడియన్స్ సెంటిమెంట్‌ను దెబ్బ కొట్టిందని మరికొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏమైనా పునర్నవి తాను యాక్ట్ చేసిన తాజా వెబ్ సిరీస్‌కు కావల్సినంత పబ్లిసిటీ తనదైన శైలిలో తెచ్చుసుకుందని ఆమె తెలివిని మెచ్చుకుంటున్నారు మరికొందరు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: