పునర్నవితో ఉన్నది ఆ బంధమే.. సిగ్గు పడుతూ చెప్పిన రాహుల్ సిప్లిగంజ్..

Punarnavi, Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం.. ఇప్పుడు తెలుగు నాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బిగ్‌బాస్ ప్రేమ జంట. బిగ్‌బాస్ షోలో ఉన్నంత సేపు హాట్ టాపిక్‌ అయ్యారు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో గాసిప్స్ పుట్టుకొచ్చాయి.

news18-telugu
Updated: November 19, 2019, 8:15 PM IST
పునర్నవితో ఉన్నది ఆ బంధమే.. సిగ్గు పడుతూ చెప్పిన రాహుల్ సిప్లిగంజ్..
పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం.. ఇప్పుడు తెలుగు నాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బిగ్‌బాస్ ప్రేమ జంట. బిగ్‌బాస్ షోలో ఉన్నంత సేపు హాట్ టాపిక్‌ అయ్యారు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అంతేకాదు.. వీరిద్దరు కలిసి ఓ లవ్ స్టోరీ సినిమాలో నటించబోతున్నట్లు తెలిసింది. వీళ్లిద్దరిపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఓ నిర్మాత సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడని, అందులో.. వీళ్లనే హీరో, హీరోయిన్లుగా పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు పునర్నవి, రాహుల్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం అనేది.. వారిద్దరైనా, సినిమా నిర్మాతైనా.. లేక కాలమే చెప్పాలి. ప్రస్తుతానికి తనను గెలిపించిన అభిమానుల కోసం కాన్సర్ట్ చేస్తానని మాటిచ్చిన రాహుల్... అందుకు సంబంధించిన షో, సెట్టింగ్స్ ఏర్పాట్లలో తలమునకలయ్యాడు. సినిమా ఆఫర్లతో పునర్నవి బిజీ అవుతోంది. అయితే.. వీరిద్దరు తాజాగా ‘అలీతో సరదాగా’ షోలో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ప్రేమ గురించి చెప్పాలని షో యాంకర్ అలీ కోరగా.. పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ప్రేమ అనేది లేదని, మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పారు. ముందుగా రాహుల్ సిప్లిగంజ్‌ను అడగ్గా.. చిలుక నవ్వులు చిందిస్తూ, సిగ్గు పడుతూ బెస్ట్ ఫ్రెండ్ అని సమాధానం ఇచ్చాడు. తర్వాత పునర్నవిని అడగ్గా.. కాసేపు నవ్వుతూనే ఉంది. ఓ సందర్భంలో ఆమె బుగ్గలు రెడ్ కలర్‌లోకి మారాయి. ఆ సందర్భంలో ఆమె ఏదైనా చెబుతుందని ప్రేక్షకులు ఆశించారు. అయితే.. మంచి స్నేహితుడని చెప్పేసింది.

అటు.. ఇదే ప్రశ్న సింగర్ నోయల్ కూడా వేయడంతో.. స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. దీంతో.. వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశపడ్డ చాలా మంది అభిమానులు తాజా వ్యాఖ్యలతో నిరాశకు గురయ్యారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>